Monday, December 23, 2024

ఉపపోరులో కూటమి జోరు

- Advertisement -
- Advertisement -

ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో వోట్లను శనివారం లెక్కించగా ప్రతిపక్షానికి ప్రోత్సాహకరంగా ఇండియా కూటమి పది సీట్లను కైవసం చేసుకున్నది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండు నియోజకవర్గాల్లో గెలిచింది. మరొక సీటు ఇండిపెండెంట్‌కు వెళ్లింది. ఈ నెల 10న ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ సెగ్మెంట్లలో హిమాచల్ ప్రదేశ్‌లో దెహ్రా, నాలాగఢ్ సీట్లు కాంగ్రెస్ పరం అయ్యాయి. హమీరపూర్ సీటు బిజెపికి దక్కింది. దెహ్రాలో ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు భార్య కమేలేశ్ ఠాకూర్‌ను కాంగ్రెస్ నిలబెట్టింది. ఆమె తన బిజెపి ప్రత్యర్థి హోషియార్ సింగ్‌పై 9399 వోట్ల ఆధిక్యంతో గెలిచారు. నాలాగఢ్‌లో హర్దీప్ సింగ్ బవా(కాంగ్రెస్) 8990 వోట్ల ఆధిక్యంతో కెఎల్ ఠాకూర్ (బిజెపి)పై గెలుపొందారు. అయితే, హమీర్‌పూర్‌లో బిజెపి నేత ఆశిశ్ శర్మ తన సమీప ప్రత్యర్థి పుష్పిందర్ వర్మ (కాంగ్రెస్)ను 1571 వోట్ల తేడాతో ఓడించారు. ఉత్తరాఖండ్‌లో రెండు సీట్లకు ఎన్నికలు జరగగా, బదరీనాథ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లాఖపత్ సింగ్ బుతోలా 5224 వోట్ల ఆధిక్యంతో బిజెపి నేత రాజేంద్ర సింగ్‌పై గెలిచారు. మంగ్లౌర్ సీటును ఖాజీ మహమ్మద్ నిజాముద్దీన్ (కాంగ్రెస్) గెలుచుకున్నారు.

ఆయన 422 వోట్ల స్వల్ప తేడాతో బిజెపికి చెందిన కర్తార్ సింగ్ బదానాను ఓడించారు. ఇండియా కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి మొహిందర్ భగత్ పంజాబ్ జలంధర్ పశ్చిమ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి, బిజెపికి చెందిన శీతల్ అగర్వాల్‌పై 37325 వోట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకున్నది, టిఎంసి అభ్యర్థులు కృష్ణ కల్యాణి (రాయిగంజ్), ముకుత్ మణి అధికారి (రానాఘాట్ దక్షిణ్), మధుపర్ణ ఠాకూర్ (బాగ్డా), సుప్తీ పాండే (మాణిక్‌తాలా) ఎన్నికయ్యారు. మధ్య ప్రదేశ్‌లోని అమర్‌వారా స్థానంలో బిజెపి అభ్యర్థి కమలేశ్ ప్రతాప్ షా 3027 వోట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షాను ఓడించారు. బీహార్‌లోని రూపౌలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ 8246 వోట్ల ఆధిక్యంత జెడి (యు) అభ్యర్థి కలాధర్ మండల్‌పై గెలిచారు. డిఎంకె తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ సీటును నిలబెట్టుకున్నది. డిఎంకె అభ్యర్థి అన్నియూర్ శివ 6700 వోట్ల ఆధిక్యంతో పిఎంకెకు చెందిన అన్బుమణి సిపై గెలుపొందారు. ఈ ఉప ఎన్నికలను బిజెపికి ముఖ్యమైన పరీక్షగా భావించారు. కానీ బిజెపికి ఆశించిన రీతిలో ఫలితాలు దక్కలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News