Monday, December 23, 2024

14 మంది న్యూస్ యాంకర్లను బహిష్కరించిన ఇండియా కూటమి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్న ప్రతిపక్ష ఇండియా కూటమి 14 న్యూస్ యాంకర్లు నిర్వహించే కార్యక్రమాలకు తమ ప్రతినిధులను పంపకూడదని సమిష్టి నిర్ణయం తీసుకుంది.

ఈ యాంకర్లు పక్షపాతంగా వార్తాప్రసారాలు సాగిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తునారని, అందుకే వీరు నిర్వహించే కార్యక్రమాలకు, షోలకు తమ ప్రతినిధులను పంకూడదని కలసికట్టుగా నిర్ణయం తీసుకున్నామని ఇండియా కూటమి తెలిపింది.
ఈ జాబితాలో దక్కించుకున్న 14 మంది న్యూస్ యాంకర్లు వీరే!

అదితి త్యాగి, అమన్ చోప్రా, అమీష్ దేవ్‌గన్ ఆనంద్ నరసింహన్, అర్ణబ్ గోస్వామి, అశోక్ శ్రీవాస్తవ్, చిత్ర త్రిపాఠి, గౌరవ్ సావంత్, నవికా కుమార్, ప్రాచి పరాషర్, రుబికా లియాఖత్, శివ్ అరూర్, సుధీర్ చౌదరి, సుశాంత్ సిన్హా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News