భూటాన్ తన పెద్ద పొరుగు దేశాలు చైనా, భారత్‌పై ఆధారపడడాన్ని నివారించేందుకు వాటితో సమతూకం పాటిస్తోంది. బిజెపి నాయ కత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొరుగు దేశాలతో భారత్ సంబం ధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. పాకిస్తాన్‌తో సాంప్రదాయకంగా శత్రుత్వంతోపాటు నేపా ల్‌తో, ఇటీవల బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు క్షీణించాయి. చైనా ఆర్థికంగా బలంగా ఉన్నప్ప టికీ, భారత్ ప్రజాస్వామ్య దేశం. అందువల్ల ఈ మార్పుల సమయంలో రాజకీయంగా క్రియాశీ లక పాత్ర పోషించగల స్థితిలో భారత్ ఉంది. 2013 నాటికి భూటాన్‌కు అపరిష్కృత సరి హద్దు వివాదాల కారణంగా చైనాతో లాంఛ నంగా దౌత్య సంబంధాలు లేవు. కౌటిల్యుని నీతి ప్రకారం భూటాన్ అంత శక్తిమంత మిత్ర దేశం కానప్పటికీ చైనాను నియంత్రించే భారత్ వ్యూహంలో కీలకం కాగలదు.
నరేంద్ర మోడీ సారథ్యంలోని భారత ప్రభుత్వం పొరుగు దేశం భూటాన్‌పై అంతకంతకు ఎక్కువ దృష్టి పెడుతోంది. భూటాన్ బాగా బలమైన మిత్ర దేశం కానప్పటికీ మోడీ ప్రాంతీయ వ్యూహానికి కీలకం కాగలదు. మే ఎన్నికల్లో తన అఖండ విజయం దరిమిలా మోడీ తన తొలి అధికారిక దౌత్య పర్యటనకు భూటాన్‌ను ఎంచుకున్నారు. యుపిఎ హయాంలో భూటాన్ ప్రాంతీయ దౌత్యం కోసం సహాయ స్వీకరణ దేశంగా భారత ప్రాథమ్య మండలంగా పరిగణన పొందిన నేపథ్యంలో ఈ పరిణామం గమనార్హం. ఆ నిరుపేద హిమాలయ రాజ్య తొలి పర్యటనకు అర్హమైన, ముఖ్యమైన పొరుగు దేశంగా ఎన్నడూ పరిగణన పొందలేదు. మోడీ ఎంతో ఆచితూచి తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయమా లేక ఈ ప్రాంతంలో ‘రాజకీయ సుస్థిరత, పురోభివృద్ధి, శాంతి’ ధ్యేయం దిశగా ఔదార్య పూర్వకంగా అనుసరించిన ఎత్తుగడా అనే ప్రశ్నను ఇది లేవనెత్తుతోంది.
భౌగోళికంగా, భూటాన్ దక్షిణాన భారత్‌లోని నాలుగు పొరుగు రాష్ట్రాలకు, ఉత్తరాన, ఈశాన్యాన చైనాకు మధ్య ఇరుక్కుపోయి ఉంది. భూటాన్- చైనా సరిహద్దు అత్యంత పర్వతమయ హిమాలయ ప్రాంతంలో సుమారు 477 కి.మీ. మేర ఉంది. సరిహద్దు దక్షిణాన భూటాన్‌లోని ఉత్తర ప్రాంతాలను, సరిహద్దుకు ఉత్తరంగా చైనాలోని టిబెట్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంతో అనుసంధానిస్తున్నది. భూటాన్- చైనా సరిహద్దును సరిగ్గా గుర్తించలేదు. రెండు దేశాల మధ్య దీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్రిక్తతకు అది కారణంగా ఉంటున్నది. భూటాన్‌తో భూప్రాంత వివాదాలు సంఘర్షణకు అవకాశం కల్పించేవిగా ఉన్నాయి. 1984 దరిమిలా రెండు ప్రభుత్వాలు ఉద్రిక్తతల తగ్గింపునకు సరిహద్దు, భద్రత అంశాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరిపాయి. భారత్, భూటాన్ మధ్య సరిహద్దు 699 కి.మీ. సుదీర్ఘ అంతర్జాతీయ సరిహద్దు. అది రెండు దేశాలను వేరు చేస్తున్నది. ఆ సరిహద్దు భారతీయ రాష్ట్రాలు అసోం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లను తాకుతున్నది. భారత- భూటాన్ సరిహద్దును సించులా సంధి ద్వారా 1865 నవంబర్ 11న ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికర విషయం ఏమిటం, భారత ఈశాన్య జనాభాకు బౌద్ధమతం ద్వారా భూటాన్ జనాభాతో మతపరమైన సంబంధం ఉండడం. అసోంలోని కొక్రఝార్‌ను గెలెఫుతో కలుపుతూ ఒక రైలు మార్గం నిర్మాణంతో పాటు భారత్ సరిహద్దులో గల గెటెఫులో ప్రత్యేక పరిపాలన ప్రాంతం (ఎస్‌ఎఆర్)ను అభివృద్ధి చేయడం గురించి భూటాన్ రాజు జిగ్మె ఖేసర్ నంగ్యాల్ వాంగ్‌చుక్ ప్రకటించడం న్యూఢిల్లీ పారా దౌత్య కృషిలో ఈశాన్య ప్రాంతం ఏ విధంగా ముఖ్య పాత్రధారిగా ఆవిర్భవిస్తోందో తేటతెల్లం చేస్తోంది. వాంగ్‌చుక్ ఎనిమిది రోజుల పర్యటనపై ఇటీవల భారత్‌కు వచ్చినప్పుడు ఆయన తన పర్యటనను ఈశాన్య రాష్ట్రం అసోంతో మొదలుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో చర్చలు జరిపారు. తన పర్యటనలో భూటాన్ రాజు గౌహతిలోని కామాఖ్య ఆలయానికి వెళ్లారు. ఆయన అక్కడ బౌద్ధ మతం, తంత్రం మధ్య సంబంధాలను అన్వేషించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఒంటికొమ్ము ఖడ్గమృగాల కేంద్రమైన కజిరంగా నేషనల్ పార్క్‌ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఆయన సఫారీని ఆస్వాదించి ఆ తరువాత జోర్హట్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లారు. భూటాన్‌కు తిరిగి చేరుకున్న తరువాత వాంగ్‌చుక్ డిసెంబర్ 17న హిమాలయ రాజ్యం జాతీయ దినోత్సవం సందర్భంగా గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీగా పేర్కొంటున్న గెలెఫు ఎస్‌ఎఆర్ అభివృద్ధి గురించి ప్రకటించారు. గెలెఫు భారత్ నుంచి భూటాన్‌లోకి మూడు ప్రధాన ప్రవేశ కేంద్రాల్లో ఒకటి. తక్కిన రెండూ తూర్పున సండ్రుప్ జోంగ్‌ఖర్, పశ్చిమాన ఫుంట్‌షోలింగ్. రాజు ఆ ప్రాజెక్టును ప్రకటిస్తూ ‘అసోం, ఈశాన్య భారత రాష్ట్రాల ద్వారా గెలెఫు లేదా సండ్రుప్ జోంగ్‌ఖర్ నుంచి మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, లావోస్, వియత్నాం, మలేషియా, సింగపూర్‌కు భూతల అనుబంధం దక్షిణాసియాను ఆగ్నేయాసియాకు అనుసంధానించే చైతన్యభరిత ఆర్థిక కారిడార్’ అని చెప్పారు. గెలెఫు ఎస్‌ఎఆర్ ప్రాజెక్టుపై వాంగ్‌చుక్ ప్రకటన, అసోంలోని కొక్రఝార్‌ను గెలెఫుతో అనుసంధానిస్తూ 57.5 కిమీ రైలు మార్గం అభివృద్ధి యత్నంతో పాటే జరిగింది.
రాజు వాంగ్‌చుక్ ఢిల్లీ పర్యటన సమయంలో ఆయనకు, మోడీకి మధ్య చర్చల ఫలితమైన రూ.10 బిలియన్ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య రైలు అనుసంధానంలో చరిత్రాత్మక మైలురాయి అవుతోంది, ఆర్థిక వృద్ధికి దోహదం చేయడంలో సజావు వాణిజ్యం ప్రధాన పాత్రను గుర్తిస్తూ అసోంలోని దరాంగాలో గల ప్రస్తుత లాండ్ కస్టమ్స్ స్టేషన్‌ను సమీకృత చెక్ పోస్ట్ స్థాయికి పెంచేందుకు ప్లాన్లు ఉన్నాయి. ఇది గెలెఫు వద్ద భూటాన్ వైపు మౌలిక వసతుల పెంపుతో కలసి మరింత సమర్థ్ధంగా, క్రమబద్ధంగా సీమాంతర వాణిజ్య వాతావరణం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది. భూటాన్‌కు టిబెట్‌తో పటిష్ఠమైన సాంస్కృతిక, చారిత్రక, మతపరమైన, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. చైనా 1950 దశకంలో టిబెట్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు టిబెట్‌తో ఆ సంబంధాలు దెబ్బ తిన్నాయి. టిబెట్ వలే కాకుండా భూటాన్‌కు చైనా సార్వభౌమత్వం కింద ఉన్న చరిత్ర లేదు. కానీ 1910లో పునాఖా సంధి దృష్టా బ్రిటిష్ రాజ్ హయాంలో బ్రిటన్ సార్వభౌమత్వం పరిధిలోకి భూటాన్ వెళ్లింది. పునాఖా సంధి కింద బ్రిటన్ భూటాన్ స్వాతంత్య్రానికి గ్యారంటీ ఇచ్చి, భూటాన్ రాయల్ ప్రభుత్వానికి పెంచిన స్టైపెండ్‌ను మంజూరు చేసి, భూటాన్ విదేశాంగ వ్యవహారాలను తన అజమాయిషీలోకి తెచ్చుకుంది. ఈ సంధి భూటాన్ విదేశాంగ సంబంధాలను మరొక సార్వభౌమ దేశానికి బదలీ చేయసాగినప్పటికీ, ఆ సంధి ఏ ప్రాంతీయ లేదా వలసవాద దేశం ఎన్నడూ ఆక్రమించుకోని కొన్ని ఆసియా రాజ్యాల్లో ఒకటిగా భూటాన్ స్వాతంత్య్రాన్ని ధ్రువీకరించింది.
టిబెట్‌తో భూటాన్ సరిహద్దును ఎన్నడూ అధికారికంగా గుర్తించలేదు. చైనీస్ అంతర్యుద్ధంలో మెయిన్‌ల్యాండ్ చైనాను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తన నియంత్రణలోకి తీసుకున్న తరువాత ఆ భూ ప్రాంతపూ ఆధిపత్యాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పిఆర్‌సి) కొనసాగిస్తోంది. టిబెటన్ ప్రభుత్వం, పిఆర్‌సి కేంద్ర ప్రభుత్వం మధ్య 17 అంశాల ఒప్పందం దరిమిలా చైనా- భూటాన్ సరిహద్దులో చైనా వైపు సైనికుల సంఖ్య పెరుగుదలతో భూటాన్ లాసా నుంచి తన ప్రతినిధిని ఉపసంహరించుకున్నది. 1959 టిబెట్ తిరుగుబాటు, 14వ దలైలామా పొరుగున ఉన్న భారత్‌లోకి ప్రవేశించడతో చైనాతో భూటాన్ సరిహద్దు భద్రత భూటాన్‌కు తప్పనిసరి అయింది. సుమారు ఆరు వేల మంది టిబెటన్లు భూటాన్‌కు పారిపోగా, వారికి ఆశ్రయం మంజూరైంది. అయితే, మరింత మంది కాందిశీకులు రావచ్చుననే భయంతో భూటాన్ ఆ తరువాత చైనాతో తన ఉత్తర సరిహద్దును మూసివేసింది. భారత్‌తో భూటాన్ సన్నిహిత సంబంధాల కారణంగా కూడా భూటాన్- చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. 2017లో భారతీయ సైన్యం, చైనా పిఎల్‌ఎ మధ్య ఘర్షణ చోటు చేసుకున్న డోఖ్ల్లామ్ పీఠభూమి తమదేనని చైనా, భూటాన్ ప్రకటించుకున్నాయి. చైనాకు, 14 వేల అడుగుల డోఖ్లామ్ పీఠభూమి మీదుగా రోడ్లు నిర్మించడం రెండు ప్రధాన వ్యూహాత్మక అవసరాలు తీరుస్తుంది. మొదటిది, ఒక రోడ్ నెట్‌వర్క్ ఆ ప్రాంతంలో చైనా మరింతగా పాతుకుపోవడానికి వీలు కల్పిస్తుంది. దీని వల్ల ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న సరిహద్దు చర్చలకు ముగింపు పలుకుతూ భూప్రాంత వివాదంలో భూటాన్ విషయంలో చైనా తాను అనుకున్న పని నెరవేర్చుకున్నట్లు అవుతుంది.
ఇక రెండవది, కొత్త మౌలిక వసతుల వల్ల సిలిగురి కారిడార్‌పై దృష్టి నిలిపే కీలక లోయ చైనీస్ సైనికులకు అందుబాటులోకి వస్తుంది. ‘చికెన్స్ నెక్’ గా పేర్కొనే ఆ కారిడార్ భారత ఈశాన్య రాష్ట్రాలను తక్కిన దేశంతో అనుసంధానించే ఇరుకైన భూమార్గం. భారతీయ సైనిక స్థావరాలపై నిఘా వేయడానికి, సంఘర్షణ సంభవించినప్పుడు భారతీయ సరఫరా మార్గాలను దెబ్బ తీయడానికి ఆ ఎత్తైన ప్రదేశంలో చైనా బలగాలు తమ స్థావరాలను ఉపయోగించుకోవచ్చు.
అయితే, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్‌ఐ) దరిమిలా చైనాతో భూటాన్ సంబంధాలు మెరుగయ్యాయి. సాధారణంగా, భూటాన్ తన పెద్ద పొరుగు దేశాలు చైనా, భారత్‌పై ఆధారపడడాన్ని నివారించేందుకు వాటితో సమతూకం పాటిస్తోంది. బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. పాకిస్తాన్‌తో సాంప్రదాయకంగా శత్రుత్వంతోపాటు నేపాల్‌తో, ఇటీవల బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు క్షీణించాయి. చైనా ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ, భారత్ ప్రజాస్వామ్య దేశం. అందువల్ల ఈ మార్పుల సమయంలో రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషించగల స్థితిలో భారత్ ఉంది. 2013 నాటికి భూటాన్‌కు అపరిష్కృత సరిహద్దు వివాదాల కారణంగా చైనాతో లాంఛనంగా దౌత్య సంబంధాలు లేవు. కౌటిల్యుని నీతి ప్రకారం భూటాన్ అంత శక్తిమంత మిత్ర దేశం కానప్పటికీ చైనాను నియంత్రించే భారత్ వ్యూహంలో కీలకం కాగలదు. అయితే, పెద్ద దేశాలు వేగంగా పని చేస్తున్నాయి. ఈ సంక్లిష్టమైన, కానీ గణనీయమైన భారత్- భూటాన్ సంబంధాల్లో పురోగతి సాధించడం భారత్‌కు కీలకం.
గీతార్థ పాఠక్
ఈశాన్యోపనిషత్
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)