Monday, December 23, 2024

పెగాసస్ ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

India bought spyware in 2017 itself: The New York Times

2017లోనే స్పైవేర్‌ను భారత్ కొనుగోలు చేసింది
ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందంలో పెగాసస్ భాగమే
న్యూయార్క్ టైమ్స్ తాజా సంచలన కథనం
మోడీ-నెతన్యాహూ అనుబంధంపై ప్రస్తావన
ప్రధాని మోడీ దేశద్రోహానికి పాల్పడ్డారు : రాహుల్
దేశాన్ని బిగ్‌బాస్ షోలా మార్చారు : శివసేన
ప్రభుత్వ మౌనం నేరాన్ని ఒప్పుకోవడమే : వామపక్షాలు
సుప్రీం పరిధిలో ఉంది, స్పందించం : కేంద్రం

న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ తాజాగా సంచలన కథనాన్ని వెల్లడించింది. దీంతో భారత్‌లో గతేడాది తరహాలోనే ఈ సారి కూడా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో వెల్లడించింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్‌-ఇజ్రాయెల్ నడుమ కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతోపాటు పెగాసస్ స్పైవేర్ కూడా భాగమేనని పేర్కొంది. ‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైబర్ ఆయుధం కోసం యుద్ధం’ పేరుతో న్యూయార్క్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరి పి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాగా ఎన్‌ఎస్‌ఓ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో భారత్ సహా పలు దేశాల్లో జర్నలిస్ట్‌లు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్టు బయటకు పొక్కడంతో వివాదం చెలరేగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఎస్‌ఓ తన సాఫ్ట్‌వేర్‌ను పలు నిఘా సంస్థలు, చట్టాలను అమలుచేసే సంస్థలకు దశాబ్దం కాలం నుంచి విక్రయిస్తోందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

తమ సాఫ్ట్‌వేర్‌కు సాటి మరేదీ లేదని, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లను స్థిరంగా, విశ్వసనీయంగా ట్రాక్ చేయగలదని వాగ్దానం చేసిందని పేర్కొంది. జులై 2017లో ప్రధాని తొలిసారి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారని, నెతన్యాహూ కూడా భారత్‌లో పర్యటించారని గుర్తు చేస్తూ నివేదించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తలు, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్లపై స్పైవేర్ సాయంతో ఇలా దేశ వ్యాపంగా 300మందిపై నిఘా పెట్టారని గత ఏడాది ‘ది వైర్’ సంచలన కథనాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో భారత్‌లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం ముదరడంతో పా ర్లమెంట్‌ను కూడా ఈ అంశం కుదిపేసింది. మ రోవైపు తాజా దుమారంపై కేంద్రం స్పందించిం ది. పెగాసస్ అంశం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉందని, నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రిటైర్డ్ జడ్జి ఆర్.రవీంద్రన్ నేతృత్వంలోని కమిటీ దానిపై విచారణ జరుపుతుందని గుర్తు చేసింది. విదేశాలతో ప్రభుత్వ ఒప్పందాలన్నీ ప్రజలకు తెలిసినవేనని, వాటిల్లో ఎలాంటి రహస్యాలు లేవని ఆ వర్గాలు వివరించాయి

అది సుపారీ మీడియా : వికె సింగ్

పెగాసస్ ఒప్పదంపై కేంద్ర మంత్రి వికె సింగ్ తీవ్రంగా స్పందించారు. న్యూయార్క్ టైమ్స్‌ను ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నిస్తూ దానిని సుపారీ మీడియాగా అభివర్ణించారు.

ఒప్పందం విలువ ఎంత?

మోడీ 2017 పర్యటన సమయంలో ఇరుదేశాల మధ్య 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరిందని, ఈ డీల్‌లోనే పెగాసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయని న్యూ యార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అనంతరం బెంజిమిన్ నెతన్యాహు భారత్‌లో పర్యటించారని, జూన్ 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు పరిశీలకుల హో దాను నిరాకరించడానికి భారత్ ఓటు వేసిందని నివేదిక పేర్కొంది. ఇజ్రాయెల్‌ను సందర్శించిన మొట్టమొదటి భారతప్రధాని మోడీయేనని ఈ కథనం తెలిపింది. అప్పటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మోడీ అత్యం త అన్యోన్యంగా ప్రవర్తించారని తెలిపింది. ఈ అన్యోన్యతకు కారణాలు ఉన్నాయని చెపుతూ భారీ ఒప్పందం, పెగాసస్ స్పైవేర్, క్షిపణి విధానంలో అందులో ఉన్నాయని వివరించింది

గతేడాది నుంచి దుమారం

పెగాసస్‌తో భారత్‌లో అనేకమందిపై నిఘా పెట్టినట్లు గత సంవత్సరం పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తోసిపుచ్చింది. సరైన ప్రాతిపదిక, ఆధారాలు లేవని కొట్టిపారేసింది. మొత్తానికి ఈ వ్య వహార కోర్టుకెక్కడంతో అక్టోబరులో సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్ర నిపుణులతో ఓ కమిటీని ఏ ర్పాటు చేసింది. భారత్‌లో నిర్దిష్టంగా కొందరు వ్యక్తులపై నిఘా పెట్టేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉ పయోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దేశ భద్రత అనే బూ చీని చూపిన ప్రతిసారీ ప్రభుత్వానికి మార్గం సు గమం కాబోదని స్పష్టం చేసింది. ఈ బూచీని చూపినంత మాత్రానికి న్యాయ వ్యవస్థ మౌన ప్రేక్షకుడిగా మారదని హెచ్చరించింది.

దేశద్రోహం : రాహుల్

పెగాసస్ వ్యవహారంపై న్యూయార్క్ టైమ్స్ కథ నం నేపథ్యంలో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించిం ది. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మం డిపడ్డారు. ప్రజలు, ప్రభుత్వ నేతలపై గూఢచ ర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని రుజువైందన్నారు. ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా అధికార పార్టీని, ప్రతిపక్షాన్ని, కోర్టును వారు లక్ష్యంగా ఎంచుకున్నారని, ఇది ముమ్మాటికీ మోడీ ప్రభుత్వం దేశద్రోహమేనని అని రాహుల్ ట్వీట్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా స్పం దించారు. మోడీ ప్రభుత్వం శత్రువుగా ఎందుకు వ్యవహరించిందని ప్రశ్నించారు. ఇది తిరుగులేని రుజువు అని మహ్మద్ అన్నా రు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశా న్ని లేవనెత్తుతామన్నారు.

బిగ్ బాస్ షోలా మార్చారు : శివసేన

బిజెపి ఈ దేశాన్ని బిగ్‌బాస్ షోలా మార్చేసింద ని శివసేన మండిపడింది. న్యూయార్క్ టైమ్స్ కథనం నేపథ్యంలో ఆ పార్టీ ఎంపి ప్రియాంక చ తుర్వేది స్పందించారు. ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై నిఘా సారించేందుకే పెగాసస్‌ను మోడీ ప్ర భుత్వం కొనుగోలు చేసిందని దుయ్యబట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News