Monday, December 23, 2024

భారత్-బ్రిటన్ బంధం మరింత పటిష్ఠం

- Advertisement -
- Advertisement -

వాణిజ్య ఒప్పందం,
విస్తృత రక్షణ భాగస్వామ్యంపై
అంగీకారానికి వచ్చిన ఉభయ
దేశాలు ముందే
స్వేచ్ఛా వాణిజ్య అగ్రిమెంట్
వైరస్ సవాళ్లకు
సంయుక్తంగా దీటైన జవాబులు
నూతన జెట్ సాంకేతిక
సాయం దేశాల ప్రధానుల
సంయుక్త విలేకరుల సమావేశం
రెండు రోజుల పర్యటన
ముగింపు

న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరికి ప్రతిష్టాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు, సరికొత్త విస్తృత రక్షణ భాగస్వామ్య ప్రక్రియ అమలుకు భారత్ బ్రిటన్‌లు సంకల్పించాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడు రోజుల భారత్ పర్యటన ముగింపు రోజు శుక్రవారం భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి జాన్సన్ విలేకరులతో మాట్లాడారు. ఇరుదేశాల ప్రధానుల మధ్య రెండు రోజల బహుముఖ చర్చలు ముగిసిన తరువాత ప్రకటన వెలువడింది. భారత్ పట్ల బ్రిటన్‌కు సహజసిద్ధమైన మిత్రత్వం ఉందని జాన్సన్ తెలిపారు. తమ దేశం అసాధారణ రీతిలో భారత్‌కు బహిరంగ సార్వత్రిక ఎగుమతుల అనుమతి (ఓజెల్)ను లైసెన్సు రూపంలో కల్పించే దిశలో తమ దేశం ఆలోచిస్తోందని జాన్సన్ చెప్పారు. దీనివల్ల రక్షణ సంబంధిత పంపిణీలు వేగవంతం అవుతాయి. సాధారణ బ్యూరోక్రసీ నివారణ, పంపిణీ గడువుల కుదింపునకు వీలేర్పడుతుందని బ్రిటన్ ప్రధానితెలిపారు. ప్రధాని మోడీ తనకు ఖాస్ దోస్తు (ప్రత్యేక స్నేహితుడు) అని జాన్సన్ కొనియాడారు. భారత్‌కు తమ దేశం నుంచి సరికొత్త ఫైటర్ జెట్ టెక్నాలజీని అందిస్తామని వెల్లడించారు.

దీనితో గగనతలంలో భద్రతకు వీలేర్పడుతుంది. ఇక సముద్ర మార్గాల ద్వారా వచ్చే ముప్పును తట్టుకునే ందుకు సకాలంలో వీటిని పసికట్టి దెబ్బతీసేందుకు వీలైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం జరుగుతుంది. అక్టోబర్ చివరికి అంటే భారతీయులకు ఇష్టమైన దివాళీకి ముందే ఖరారు చేస్తారని భావిస్తున్నట్లు జాన్సన్ తెలిపారు. దీనిపై ప్రధాని మోడీ కూడా ఆశాభావంతో స్పందించారు. ఇరు పక్షాలూ ఈ ఒప్పందాన్ని అంతిమంగా ఈ ఏడాది చివరికి ఖరారు చేసుకుని తీరాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రక్షణ భద్రత రంగాలకు పూర్తి సాయం అందించడం దీనికి తోడుగా భారత్ రక్షణస్వయంసమృద్ధి, సంబంధిత రక్షణ ఉత్పత్తుల రంగంలో ఆత్మనిర్భరతకు అంటే ఉత్పత్తి, సాంకేతికత, నమూనాలు, రూపకల్పనల్లో కూడా భారతదేశ స్వయంసమృద్ధికి సాయం అందించేందుకు బ్రిటన్ ముందుకు వచ్చిందని ఇది ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు.

సంప్రదింపులతో ఉక్రెయిన్ సమస్య పరిష్కారం

ఇప్పటి రగులుకున్న ఉక్రెయిన్ యుద్ధ సమస్య పరిష్కారం కేవలం సంప్రదింపులు దౌత్య ప్రక్రియతోనే సాధ్యం అవుతుందని ప్రధాని మోడీ చెప్పారు. ముందు గా ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ జరగాలని పిలు పు నిచ్చారు. ఇక్కడనే కాదు ఏ దేశపు ప్రాంతీయ భౌగోళిక ప్రాదేశిక సమగ్రతల పరిరక్షణ కీలకమైన విషయం అని తెలిపారు.

అమితాబ్, సచిన్‌లా ఫీలయ్యా : జాన్సన్

గుజరాత్ పర్యటన తనకు అమితానందం కల్గించిందని తనకు తాను అమితాబ్ బచ్చన్ లేదా సచిన్ టెండూల్కర్ అన్పించిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతసించారు. సబర్మతిలో పలు చోట్ల తన భారీ కటౌట్లు గానా బజానాలు చూసి ఉప్పొంగిపొయ్యానని, మీరు చూసే ఉంటారు బుల్‌డోజర్ల కంపెనీలో తాను బుల్‌డోజర్‌పైకి దూకేశానని, భారత్‌లో ఆతిధ్యం ఇంత గొప్పగా ఉంటుందని తాను అనుకోలేదన్నారు.

మాల్యా, నీరవ్ అప్పగింతలకు మేం రెడీ

విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధపడింది. ఈ దిశలో ఆదేశాలు కూడా వెలువరించామని అయితే భారత్‌కు వీరి అప్పగింత ఘట్టానికి చట్టపరమైన సాంకేతిక అంశాలు అడ్డుతగులుతున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి పంపిణీ దిశలో భారత్ కృషిని కొనియాడారు. ఇక్కడే నిజం చెపుతున్నా తన భుజంలో దిగింది భారతీయ టీకానే అని శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News