Thursday, November 14, 2024

విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పాడి రైతుల ప్రోత్సహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపట్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాగు ఉత్పతుల కోసం గిడ్డంగులు ప్రాసెసింగ్ కోసం ఆర్థిక సాయం, నూనె గింజ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం కొత్త పథకం సృష్టించామని వివరణ ఇచ్చారు. తాత్కాలిక బడ్జెట్ 2024-25 ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆమె లోక్‌సభలో ప్రసంగించారు. బడ్జెట్ మొత్తం పరిమాణం రూ.47.66 లక్షల కోట్లు కాగా వివిధ మార్గాల ద్వారా రూ.30.8 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లతో పాటు ఎగుమతి, దిగుమతి సుంకాలలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.

దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వాపార్కులు రూపొందిస్తామని, డెమోగ్రసీ, డెమోక్రసీ, డైవర్సిటీ అనే మూల సూత్రాలుగా భారత్ ముందడుగు వేస్తోందని, 2047 నాటి నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలియజేశారు. మధ్యతరగతి కోసం నూతన గృహ నిర్మాణ విధానం తెస్తున్నామని, బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్ లో వేతన జీవులకు ఊరట కల్పించారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, ఆశాలు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపజేస్తామని, జిడిపి అంటే గవర్నెన్స్ డెవలపమెంట్ పెర్మార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చామన్నారు.

భారత్ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్‌కు ప్రత్యేక కారిడర్ ఉంటుందని, మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించామని, అవకాశాల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందడుగు వేస్తోందని, కొత్త ప్రపంచంలో అనుసంధానమవుతూ భారత్ దిక్సూచిగా నిలబడుతోందని ఆమె వివరణ ఇచ్చారు. దేశ తూర్పు ప్రాంతాన్ని నూతన అభివృద్ధి రథంగా మారుస్తున్నామని, విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం తీసుకొస్తున్నామని తెలియజేశారు. రూప్ టాప్ సోలార్ తో కోటి ఇండ్లకు మూడు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తామని వెల్లడించారు. వచ్చే ఐదేండ్లు దేశానికి స్వర్ణయుగం అని తెలిపారు. సంస్కరణ పథంలో ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందిందని చెప్పారు. పిఎం అవాస్ యోజన కింద మరో రెండు కోట్ల ఇండ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. పిల్లల ఆరోగ్య కోసం ఇంద్ర దనస్సు కార్యక్రమం చేపట్టామని వివరణ ఇచ్చారు.

ఈ బడ్జెట్‌తో నిర్మలాసీతారామన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు.వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ రికార్డును సమం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా రికార్డును అధిగమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News