Monday, December 23, 2024

‘బంగారు భారత్’ నిర్మిస్తా… దీవించండి

- Advertisement -
- Advertisement -

దేశాన్ని అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాలనే ఆ దిశగా సాగడం లేదు. అందుకే సమూల మార్పు కోసం ఢిల్లీ బయల్దేరుతున్నా. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇప్పుడు మన విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. భవిష్యత్తులో విదేశీ విద్యార్థులే వీసాలు తీసుకొని మన దేశానికి వచ్చేలా ఇక్కడ అభివృద్ధి జరగాలి. ప్రస్తుతం దేశంలో దుర్మార్గమైన మత రాజకీయాలు నడుస్తున్నాయి. అటువంటి వారికి ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్పాలి.

ఎన్నో కష్టాలు పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. సాధించుకున్న రాష్ట్రాన్ని ఏవిధంగా చేశామో అనతికాలంలోనే దేశానికి తెలియజేశాం. మన రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయి. అందుకే దేశం యావత్తూ మన రాష్ట్రం వైపు చూస్తున్నది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోనూ జరగాలని బలంగా కోరుకుంటున్నా. ఇప్పటివరకు అందుకోసం ఎంతో నిరీక్షించా. కానీ ఆ దిశగా కేంద్రంలోని బిజెపి సర్కారు అడుగులు వేయడం లేదు. పైగా రాష్ట్రాలపై పెత్తనం చేస్తూ పక్కా మత రాజకీయాలను ప్రోత్సహిస్తోంది.

దేశంలోని వేలాది గ్రామాలు ఇంకా కరెంటుకు నోచుకోలేదు మంచినీళ్లెరగని పల్లెలు అసంఖ్యాకంగా ఉన్నాయి
పాలకుల్లో ఒక రకమైన తపన ఉండాలి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయినా గ్రామీణ ప్రజలు కనీస
అవసరాల కోసం ఇంకా ఎదురు చూడవల్సిందేనా? మనమే దేశంలో సరికొత్త పాలనకు నాంది పలికేలా
ఎదుగుదామా? తెలంగాణ ప్రజలుగా సమ్మతమేనా సోమవారం నారాయణఖేడ్‌లో సంగమేశ్వర,
బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రజలను ప్రశ్నించిన
ముఖ్యమంత్రి కెసిఆర్ అందుకు మద్దతు తెలిపిన మహాజనం

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాన్ని ‘బంగారు భారత్’గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే తాను దేశ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఏడేళ్ళ కాలంలోనే ఒక దీక్ష, పట్టుదల, లక్షంతో బాగు చేసుకున్నామన్నారు. అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. అదే రీతిలో దేశాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. అందుకే జాతీయ రాజకీయాల్లో ఇకపై కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నట్లు సిఎం కెసిఆర్ వెల్లడించారు. భారత్‌ను అమెరికా కంటే గొప్ప గా తీర్చిదిద్దుకోవచ్చు. ఇందుకు అవసరమైన వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. కానీ ఆ దిశగా పాలన సాగడం టొలేదన్నారు. అందుకే సమూల మార్పు కోసమే కోట్లాటకు తాను ఢిల్లీ బ యలుదేరుతున్నానన్నారు. అందుకు మీ అందరి దీ వెనలు కావాలని సిఎం కెసిఆర్ కోరారు. ఇప్పటివరకు ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు అమెరికా వెళ్లేవారని…కాని భవిష్యత్తులో విదేశీ విద్యార్థులే మ న దేశానికి వీసాలు తీసుకుని వచ్చే విధంగా అభివృ ద్ధి జరగాలన్నారు.

ప్రస్తుతం దేశంలో దుర్మార్గమైన మత రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. అలాంటి వారికి ప్రజలు తగు రీతిలో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం నారాయణ్‌ఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడుతూ, జాతీయ రాజకీయ ప్రవేశంపై కీల క వ్యాఖ్యలు చేశారు. ఎన్నో కష్టాలు పడి తెలంగాణ రాష్ట్రా న్ని సాధించుకున్నాం…..సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా అ భివృద్ధి చేశామో అనతి కాలంలోనే దేశానికి తెలియజేశామన్నారు. మన రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రస్తుతం దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. అం దుకే దేశం యావత్తు మన రాష్ట్రం వైపు చూస్తున్నదన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి…దేశంలోనూ జరగాలని బ లంగా కోరుకుంటున్నానని అన్నారు. ఇప్పటి వరకు అలాంటి ప్రగతి కోసం ఎంతో నిరీక్షించానని అన్నారు. కానీ ఆ దిశగా కేంద్రంలోని బిజెపి సర్కార్ అడుగులు వేయడం లేదన్నారు.

పైగా రాష్ట్రాలపై పెత్తనం చేస్తూ….పక్కా మత రాజకీయాలను ప్రొత్సహిస్తోందని సిఎం కెసిఆర్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. వారు చేస్తున్న విధానాలపై కత్తికట్టే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.ఎట్లైతే తెలంగాణను బాగు చేసుకున్నామో….. అదే పద్ధతిలో భారతదేశ రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించనునున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. భారత్‌ను ప్రపంచ దేశాలకు దీటుగా అన్ని రంగాల్లో అభివృ-ద్ధి చేయడానికి అవసరమైన అన్ని వనరులు దేశంలో ఉన్నాయన్నారు. ఇందుకు పాలకులల్లో ఒక త పన ఉండాలన్నారు. కాని దురదుష్టవశాత్తు ఆ విధంగా పాల న సాగని కారణంగానే దేశంలోని వేలాది గ్రామాలు ఇంకా కరెంటుకు నోచుకులేకపోయాయని సిఎం కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంటుతో పాటు తాగడానికి నీటికి నోచుకుని పల్లెలు కూడా లెక్కలేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డైబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా….ఇంకా గ్రామాల్లోని ప్రజలు కనీస అవసరాల కోసం ఎదురుచూడాల్సిందేనా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రాన్ని ఏడేళ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన విధంగా కేంద్రం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. వారిని…వీరిని మనం అడగకుండా….మనమే దేశంలో సరికొత్త పాలనకు నాందిపలికే విధంగా ఎదుగుదా మా?. ఇందుకు తెలంగాణ ప్రజలుగా మీకు సమ్మతమే కా దా?అని సభికులను ఉద్దేశించి కెసిఆర్ అడిగారు. దీం తో సభ లో ఉన్నవారు పెద్దఎత్తున కెసిఆర్‌కు మద్దతు తెలియజేస్తూ…. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నినాదాలు చేశారు.

గతంలో చాలా వెనుకబడి ఉండేది

గతంలో నారాయణఖేడ్ చాలా వెనకబడి ఉండేదని సిఎం గుర్తుచేసుకున్నారు. జహీరాబాద్‌లో చెరువుల పరిస్థితి అధ్వానంగా ఉండేదన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు లబ్ధి చేకూరనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో రూ.4,427 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాల ద్వారా 3.87 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు స్పష్టం చేశారు. రానున్న రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఎం వెల్లడించారు. ‘తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో ఈ ప్రాంతానికి వస్తే పది మంది కార్యకర్తలు ఉండేవారు కాదన్నారు. ప్రజల్లో కూడా పెద్దగా ఆశ ఉండేది కాదన్నారు.

కెసిఆర్ వస్తుండు.. పోతుండు.. తెలంగాణ వస్తదా? రాదా? అని అనేక సందేహాలు ఇక్కడి ప్రజల్లో ఉండేవన్నారు. వేరే పార్టీల వారు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేసేవారన్నారు. తెలంగాణ వస్తే తప్ప పరిస్థితులు మారవని ఉద్యమం చేశానని…. ఉద్ధృతంగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పరిశ్రమలు మూతపడతాయని కొంత మంది చెప్పారని…అలాగే స్థానిక ( తెలంగాణ) నాయకులకు పరిపాలన చేతకాదని ఎద్దేవా కూడా చేశారన్నారు. కానీ హేళన చేసిన వారి రాష్ట్రంలోనే ప్రస్తుతం అంధకారం అలుముకుంటుందన్నారు. మన రాష్ట్రంలో వెలుగులు జీగేలు మంటున్నాయన్నారు. ఇప్పుడిప్పుడే ఆంధ్రపాలకులు అవాస్తవాలు గ్రహిస్తున్నారన్నారు. దేశంలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం ఏదేనా ఉందంటే…అది ముమ్మాటికి తెలంగాణే అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు.

వరాల జల్లు…

జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలకు నీరందాలని సిఎం ఆకాంక్షించారు. ఏడాదిన్నరలోపు ప్రాజెక్టులు పూర్తి చేసేలా నేతలు కృషి చేయాలని సూచించారు. గజ్వేల్ కంటే ఎక్కువగా ఆందోల్‌కు నీళ్లు వస్తున్నాయన్న ఆయన… ఈ ప్రాజెక్టుల ద్వారా ఆందోల్‌కు 1.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు. మరోసారి సంగమేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తానని హామీనిచ్చారు. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్లు చొప్పున నిధులు మంజూరు చేస్తానని కూ డా భరోసానిచ్చారు. మిగతా 6 మున్సిపాలిటీలకు రూ.25 కో ట్లు చొప్పున నిధులు ఇస్తామన్నారు. ‘సంగారెడ్డి జిల్లాలోని పం చాయతీలకు రూ.20 లక్షల చొప్పున రూ. 140 కోట్ల నిధులు మంజూరు చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో అన్ని తండాలకు రోడ్లు వేయిస్తాం. నిధులు విడుదల చేస్తూ రేపు జీవోలు జారీ చేస్తాం. పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. తలసారి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రైతు బంధు సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుంది. రైతులు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News