న్యూయార్క్: రాబోయే 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.7 ట్రిలియన్ డాలర్లతో దాదాపు రెట్టింపు అవుతుందని ఎస్ అండ్ పి గ్లోబల్ అంచనా వేసింది. భారత్ జిడిపి ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పి గ్లోబల్ భారత ఆర్థిక వ్యవస్థపై విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏటా 6.7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ తలసరి ఆదాయం 4500 డాలర్లుగా(రూ.3,72,507) ఉంటుందని, ఇది ప్రస్తుతం దాదాపు 2500 డాలర్లుగా ఉందని ఎస్ అండ్ పి గ్లోబల్ వెల్లడించింది.
భవిష్యత్తులో వృద్ధిని వేగవంతం చేసేందుకు శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా ముఖ్యమని నివేదిక పేర్కొంది.2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం 24 శాతం మాత్రమే ఉంది. నివేదిక ప్రకారం, భారతదేశ సేవల ఎగుమతి దేశ ఆర్థికాభివృద్ధికి అతిపెద్ద ఇంజన్‌గా నిరూపితం కానుంది. ఆర్థిక సేవలపై ప్రస్తుతం 280 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యయం 670 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఎస్ అండ్ పి గ్లోబల్ తన నివేదికలో పేర్కొంది. ఎస్ అండ్ పి గ్లోబల్ ప్రకారం, స్టార్టప్‌లలో వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ 2030 నాటికి రెట్టింపు అవుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ రోబోటిక్స్, క్లీన్ టెక్నాలజీ వంటివి రాబోయే రోజుల్లో అతిపెద్ద ప్రయోజనాలను పొందబోతున్నాయి.
ఈ రంగాలలోకి వచ్చే మూలధనం ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశ సగటు జిడిపి వృద్ధి 6.7 శాతంలో 53 శాతం దోహదం చేస్తుంది. భారతదేశ వినియోగదారుల మార్కెట్ పరిమాణం 2031 నాటికి రెట్టింపు కానుందని, ఇది 2022లో 2.3 ట్రిలియన్ డాలర్లు ఉండగా, 2031 నాటికి 5.2 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని గ్లోబల్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. ఆహార పదార్థాలపై వినియోగదారుల వ్యయం 615 బిలియన్ డాలర్ల నుండి 1.4 ట్రిలియన్