ముంబై : వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బుధవారం టీమిండియాను ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు కోహ్లి, భువనేశ్వర్, షమి, హార్దిక్, రిషబ్ పంత్, బుమ్రా తదితరులకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో సిరీస్‌లో స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఈ సిరీస్ కోసం యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమా ర్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, చాహల్, అవేశ్‌ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు టీమిండియాలో చోటు సంపాదించారు. ఇక సిరీస్‌లో భారత్ మూడు వన్డేలు, మరో ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 22న జరిగే తొలి వన్డేతో సిరీస్‌కు తెరలేవనుంది. ఇక మూడు వన్డేలు కూడా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోనే నిర్వహించనున్నారు. మూడు టి20 మ్యాచ్‌లు విండీస్‌లో, మరో రెండు టి20లు అమెరికాలో నిర్వహిస్తారు.