Sunday, December 22, 2024

ఆత్మవిశ్వాసం పెరిగింది: కెఎల్ రాహుల్

- Advertisement -
- Advertisement -

కొలంబో: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకం సాధించడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని టీమిండియా స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్ పేర్కొన్నాడు. గాయాలతో సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరంగా ఉన్న తనకు ఈ ఇన్నింగ్స్ కొత్త జోష్ నింపిందన్నాడు. పాకిస్థాన్ వంటి బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన టీమ్‌పై సెంచరీ సాధించడం గొప్పగా ఉందన్నాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న తనకు ఈ సెంచరీ చాలా ప్రత్యేకమైందన్నాడు.

ఇక విరాట్ కోహ్లితో కలిసి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం కూడా గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నాడు. కోహ్లితో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పవడం ఆనందం కలిగించిందన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచేందుకు ఈ ఇన్నింగ్స్ దోహదం చేస్తుందనడంలో సందేహం లేదన్నాడు. ఇక జట్టు యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడమే తన ముందున్న ప్రధాన లక్షమని రాహుల్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News