అమెరికా వ్యవసాయ వస్తువులపై భారతదేశం వంద శాతం సుంకాన్ని విధిస్తోందని, దీనివల్ల అమెరికా ఉత్పత్తులు కొన్ని విదేశీ మార్కెట్లకు చేరడం దాదాపు అసాధ్యంగా మారిందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 2నుంచి అమెరికా వస్తువులపై పన్ను విధించే దేశాలపై పరస్పరం సుంకాలు అమలులోకి రానున్న నేపథ్యంలో వైట్ హౌస్ సోమవారం భారతదేశం వ్యవహారం అన్యాయంగా ఉందని పేర్కొంది.అధిక సుంకాలతో యుఎస్ ఎగుమతి దారులకు నష్టం కలిగిస్తున్న దేశాల జాబితాలో ఇండియాను చేర్చింది. ఇండియా అమెరికా ఉత్పత్తులపై 100 శాతం సుంకం విధింపువల్ల తీవ్రనష్టం జరుగుతోందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ పేర్కొన్నారు.
ఇక పరస్పర సుంకాల విధింపునకు సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ప్రెసిడెంట్ ట్రంప్ బుధవారం చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారని వెల్లడించారు. చాలా దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అనుసరిస్తున్నాయని ఆమె దుమ్మత్తి పోశారు.యూరోపియన్ యూనియన్ నుండి అమెరికన్ పాల ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు, జపాన్ నుండి అమెరికన్ బియ్యంపై700 శాతం సుంకాలు మరియు కెనడా అమెరికన్ వెన్న,చీజ్‌పై దాదాపు 300 శాతం సుంకాలు. భారతదేశం అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకం విధించడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది అని లివిట్ అన్నారు.ఏప్రిల్ 2న పరస్పర సుంకాల విధింపు అతి పెద్ద గేమ్ ఛేంజర్ కాగలదని హెచ్చరించారు.