- Advertisement -
న్యూఢిల్లీ : సరిహద్దు ఒప్పందం మేరకు భారత్ చైనా శుక్రవారం ను చి సైనిక ఉపసంహరణ ప్రక్రియకు దిగాయి. ముందుగా ఘర్షణలకు తావు ఉండే ప్రాంతాల నుంచి ఇరుపక్షాలు సైన్యం వాపసీ ఆరంభించాయని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెం బడి సైనిక ఉపసంహరణ కార్యక్రమం సజావుగా మొదలైం ది. రెం డు ప్రధాన వివాదాస్పదక స్థావరాలు డెమోచోక్, దెప్సాంగ్ ప్లె యిన్స్ వద్ద సందడి నెలకొంది. ఈస్టర్న్ లద్దాఖ్‌లో ఇరుపక్షాల మధ్య తరచూ ఘర్షణలకు ఈ రెండు స్థావరాలు ప్రధాన కేంద్రాలు అవుతూ వస్తున్నాయి. ఇక్కడ పరస్పరం సైన్యం వెనకకు వెళ్లడం కీలక పరిణా మం అని సైనిక వర్గాలు తెలిపాయి. సైన్యం ఉపసంహరణ ప్రక్రియ రెండు రోజుల్లోనే అంటే దాదాపుగా ఈ నెల 29 వరకూ పూర్తి అవుతుందని అంచనావేస్తున్నారు.
- Advertisement -