- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ చైనా మధ్య 12వ దఫా ఉన్నత స్థాయి సైనిక చర్చలు శనివారం జరుగుతాయి. తూర్పు లద్థాఖ్ ప్రాంతంలో బలగాల ఉపసంహరణ దిశలో పరస్పర చర్చలపై ఈ దఫా సంప్రదింపులలో దృష్టి కేంద్రీకరిస్తారని సైనిక అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇటీవలి కాలంలో ఇక్కడి భారతీయ భూభాగంలో చైనా టెంట్లు వెలియడం వివాదాస్పదం అయింది. ఎల్‌ఎసి వెంబడి ఉన్న చైనా భూభాగంలోని మోల్డో సరిహద్దు కేంద్రం వద్ద కార్ప్ కమాండర్స్ స్థాయి చర్చలు ఉదయం పదిన్నరకు ఆరంభం అవుతాయి. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా లలో ఉన్న అపరిష్కృత వివాదాల పరిష్కారానికి ఈ చర్చలు కీలకం కానున్నాయి. ఇంతకు ముందు 11వ దఫా చర్చలు ఎప్రిల్ 9వ తేదీన జరిగాయి.
India-china military talks tomorrow
- Advertisement -