- Advertisement -
న్యూఢిల్లీ: భారత్-చైనా సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లోక్ సభలో వివరించారు. 2020లో చైనా కారణంగా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తలు పెరిగాయన్నారు. మన బలగాలు చైనాను ధీటుగా కట్టడి చేశాయన్నారు. అయితే నిరంతర దౌత్య చర్చల ఫలితంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగపడ్డాయన్నారు. సరిహద్దులో శాంతి, స్థిరత్వం లేకుండా రెండు దేశాల సంబంధాలు సాధారణంగా ఉండలేవని మన ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. న్యాయమైన, సహేతుక, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చైనాతో చర్చలు జరిపేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు.
- Advertisement -