Friday, November 15, 2024

రెండో ర్యాంక్‌కు టీమిండియా

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తాజాగా ప్రకటించిన టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్ కోహ్లి సేన 21తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంతో ఐసిసి టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ను మూడో స్థానానికి నెట్టేసింది. ప్రస్తుతం టీమిండియా 119 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ 118 పాయింట్లతో మూడో ర్యాంక్‌కు పడిపోయింది. ఇక ఈ సిరీస్‌లో ఓడినా ఇంగ్లండ్ తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్ 121 పాయింట్లతో వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే భారత్ కంటే ఇంగ్లండ్ కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఆధిక్యంలో ఉంది. కానీ సమీప భవిష్యత్తులో భారత్ వన్డే సిరీస్‌లు ఆడే అవకాశం లేదు. దీంతో ఇంగ్లండ్ టాప్ ర్యాంక్‌కు వచ్చే నష్టమేమీ కనిపించడం లేదు. కాగా ఆస్ట్రేలియా నాలుగో, సౌతాఫ్రికా ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.

India climb to top 2 in ICC ODI Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News