దుబాయి: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఘన విజయం సాధించడం ద్వారా భారత్ మళ్లీ టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ ఆశలు మరింత పెరిగాయి. ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టుల్లో కనీసం ఒకదాంట్లో నెగ్గినా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంగ్లండ్ ఫైనల్ చేరాలంటే మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలవక తప్పదు. ఇక రెండో టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా మిగిలిన మ్యాచుల్లోనూ చెలరేగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రహానె, రిషబ్ పంత్, అశ్విన్, పుజారా, గిల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా తయారైంది. దీంతో అహ్మదాబాద్‌లో జరిగే గులాబీ టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడమే లక్షంగా పెట్టుకున్న భారత్ రానున్న రెండు మ్యాచుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది. బౌలింగ్ కూడా గాడిలో పడడంతో టీమిండియా ఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఇంగ్లండ్‌పై విజయంతో భారత్ మళ్లీ టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండో స్థానానికి చేరుకుంది. 70 పాయింట్లతో న్యూజిలాండ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. భారత్ 69.7 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 69.2 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, 67 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక ఇంగ్లండ్భారత్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టు చాంపియన్‌షిప్ రెండో ఫైనల్ బెర్త్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఫైనల్ రేసులోనే ఉన్నాయి.
India climb up to 2nd spot in ICC Test Championship