Saturday, November 23, 2024

చైనాలో భూభాగంగా జమ్ముకశ్మీర్: డబ్లుహెచ్‌ఒకు భారత్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన వివిధ పోర్టల్స్‌లో జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన రంగులో చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాగే 1969 లో చైనాకు పాకిస్థాన్ చట్ట విరుద్ధంగా ఇచ్చిన 5168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని షేక్స్‌గమ్ వ్యాలీని చైనాలో భూభాగంగా చూపించారు.1954లో చైనా ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని లేత నీలం రంగు గళ్లలో చూపించారు. చైనా భూభాగాన్ని చూపించడానికి ఉపయోగించిన రంగు కూడా ఇదే.

దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఈ విషయాన్ని బలంగా లేవనెత్తినట్టు చెప్పారు.

India complaint to WHO over show J&K as part of China

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News