Friday, November 22, 2024

కెనడాలో సిక్కు విద్యార్థిపై దాడి.. ఖండించిన భారత్

- Advertisement -
- Advertisement -

ఒట్టావా : కెనడాలో సిక్కు విద్యార్థిపై జరిగిన దాడిని వాంకోవర్‌లోని భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. బస్సు దిగి వెళ్లిపోతున్న 17 ఏళ్ల సిక్కు విద్యార్థిపై మరో టీనేజర్ పెప్పర్ స్ప్రేను చల్లాడు. ఐదు రోజుల క్రితం ఈ సంఘటన జరిగిందని వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ సంఘటనకు ముందు బాధితుడు, ఇతర విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు.

దీనిపై దౌత్యకార్యాలయం స్పందిస్తూ ఘటనపై దర్యాప్తు జరిపి , కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ఈ ఘటనపై కెలౌనా సిటీ కౌన్సిలర్ మోహినీ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘చదువు పరంగా ఆ పిల్లాడు చురుగ్గా ఉంటాడు. ప్రస్తుతం అతడు షాక్ లోకి వెళ్లిపోయాడు. ఇండోకెనడియన్ కమ్యూనిటీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ’ అని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఈ తరహాలో జరిగిన రెండో సంఘటన ఇది. మార్చి నెలలో భారత సిక్కు విద్యార్థి గగన్‌దీప్ సింగ్ దాడికి గురయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News