Wednesday, December 25, 2024

14 వేల మంది చిన్నారులతో జాతీయ గీతాలాపన

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారతీయ సంగీత దర్శకుడు గ్రామీ విజేత రిక్కీ కేజ్, బ్రిటిష్ ఆర్కెస్ట్రా, 14 వేల మంది ఆదివాసీ చిన్నారులతో మన జాతీయ గీతాన్ని వైవిధ్యభరితంగా ఆలపించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈమేరకు వీడియోను రూపొందించారు. ఈ గీతాలాపన గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు చేసుకుంది. ఈ వీడియోను రిక్కీ కేజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, రాకేశ్ చైరాసియా, రాహుల్‌శర్మ, అమన్, అయాన్‌ఆలి బంగాశ్, జయంతి కుమరుశ్, షేక్ మహబూమ్,

కలీషాబీ మహబాబ్, వంటి ప్రముఖ శాస్త్రీయ సంగీక విద్వాంసులు, తమ వాయిద్యాలతో జాతీయ గీతాన్ని ప్రత్యేకంగా పలికించారు. వీరితోపాటు బ్రిటన్ లోని రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాకు చెందిన 100 మంది సభ్యుల బృందం కూడా ఈ గీతాలాపనలో పాల్గొంది. కలింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన 14 వేల మంది ఆదివాసీ చిన్నారులు భారత దేశం చిత్రపటం ఆకృతిలో , భారత్ ఆంగ్ల, హిందీ అక్షర క్రమంలో నిల్చొని జారీయ గీతాన్ని ఆలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News