Monday, December 23, 2024

“జీతేగా భారత్” ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేసిన “ఇండియా”

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బెంగళూరులో మంగళవారం జరిగిన 26 ప్రతిపక్ష పార్టీల సమావేశం తమ కూటమికి ఇండియా(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) అని నామకరణం చేసిన మరుసటి రోజు బుధవారం నాడు జీతేగా భారత్ అన్న ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా, జీతేగా భారత్ అనే ఛత్రం కింద బిజెపిపై తలపడతాయి.
మంగళవారం రాత్రిబెంగళూరులో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం జీతేగా భారత్ అనే ట్యాగ్‌లైన్ ఖరారైంది. ప్రతిపక్ష కూటమికి హిందీ భాషలో ట్యాగ్‌లైన్ ఉండాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే వర్గం) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సూచన మేరకు ఈ ట్యాగ్‌లైన్ ఖరారైంది. 2024 లోక్‌సభ ఎన్నికలు మోడీ వర్సెస్ ఇండియా యుద్ధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం అభివర్ణించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ, ఇండియా మధ్య, మోడీ, ఇండియా మధ్య, మోడీ సిద్ధాంతాలు, ఇండియా మధ్య పోరాటం ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు. అన్ని పోరాటాల్లో ఇండియా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే..బిజెపి భారత్ వర్సెస్ ఇండియా పోటీగా దీన్ని అభివర్ణించే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా ప్రతిపక్ష కూటమి జీతేగా భారత్ అన్న ట్యాగ్‌లైన్‌ను చేర్చాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News