- Advertisement -
న్యూఢిల్లీ : ప్రాధాన్యతా రంగం రుణం విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలను(ఇవి) చేర్చాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈమేరకు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రిజర్వు బ్యాంక్‌తో చర్చించిన అంశాలపై ఆయన మాట్లాడుతూ, ప్రాధాన్యతా రంగంలో ఇవిలను చేర్చేందుకు ప్రతిపాదనను అందుకున్నామని, బ్యాంకులకు ప్రాధాన్యతా రంగం రుణం అవసరాలపై తాము పరిశీలిస్తున్నామని అన్నారు.
ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, ప్రాధాన్యత రంగానికి నికర బ్యాంకు రుణాన్ని 40 శాతం వరకు పెంచేందుకు బ్యాంకులకు నిబంధనలు ఉంటాయి. ప్రస్తుతం ఏడు రంగాలు అయిన వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎగుమతి రుణాలు, సామాజిక మౌలికసదుపాయాలు, రెన్యూవబుల్ ఎనర్జీలు ప్రాధాన్యత రంగం రుణం(పిఎస్‌ఎల్)లో ఉన్నాయి.
- Advertisement -