సుంకాల విషయంలో మోదీ ప్రభుత్వం ఆచీ తూచీ వ్యవహరిస్తోంది. 66 బిలియన్ అమెరికా డాలర్ల ఎగుమతులను కాపాడుకునేందుకే 23 బిలియన్ డాలర్ల విలువైన యుఎస్ దిగుమతులపై సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్రెండోసారి బాధ్యతలు చేపట్టగానే భారత ప్రధాని మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. కానీ ట్రంప్ భారతదేశాన్ని టారిఫ్ కింగ్, అంటూ,విపరీతంగా సుంకాలను విధించే దేశంగా దుమ్మెత్తి పోస్తూ, టారిఫ్ లను పెంచివేస్తూ, ఏ దేశాన్ని కూడా సుంకాలు విధించకుండా విడిచి పెట్టబోనని ప్రకటిస్తూ వచ్చారు.భారత – అమెరికా లమధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు జరుగుతున్నాయి. తొలి దశలో భారతదేశం యుఎస్ దిగుమతులలో సగానికి సగం సుంకాలను తగ్గించేందుకు సిద్ధమైంది. 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను భారీగ తగ్గించేందుకు
అంగీకరించింది. ఈ సంవత్సరంలో ఇంత పెద్దఎత్తున సుంకాలను తగ్గించడం ఇదే ప్రథమం.ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచవాప్తంగా పరస్పర సుంకాలను తీవ్రంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2నుంచి సుంకాల పెంపు అమలులోకి వస్తుంది.
దీంతో ఆ ప్రభావాన్ని తగ్గించాలనిమనదేశం భావిస్తోంది. విపరీతంగా సుంకాల పెంపువల్ల అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యే ప్రమాదం ఉంది. అలాగే పశ్చిమ దేశాల లోని మిత్ర దేశాల విధాన రూపకర్తలు ఇబ్బందుల పాలవుతారు. ఇండియా అమెరికాకు 66 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతిచేస్తోంది. పరస్పర సుంకాల వల్ల అమెరికాకు చేసే మొత్తం ఎగుమతుల్లో 87 శాతం పై ప్రభావం ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. సంప్రదింపులలో ఉన్న ఒప్పందం ప్రకారం భారతదేశం దిగుమతి చేసుకునే అమెరికా వస్తువులపై సుంకాలను దాదాపు 55 శాతం తగ్గించేందుకుసిద్ధమయింది.భారతదేశం అమెరికాకు చేసే ఎగుమతుల్లో ముత్యాలు, ఖనిజ ఇంధనాలు, యంత్రాలు, బాయిలర్లు, విద్యుత్ పరికరాల వంటి వస్తువులో సగం వరకూ ఉన్నాయి. పరస్పర సుంకాల విధానం కారణంగా ఈ వస్తువుల పై సుంకాలు, 6 నుంచి 10శాతం పెరుగుతాయి.
11 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన ఔషధాలు, అటో మోటివ్ ఎగుమతులపై ఈ సంకాల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.