Wednesday, January 22, 2025

రోదసీ అన్వేషణలో మన ప్రయత్నాలు కొనసాగుతాయి : మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్ తన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 లాంచింగ్‌ను విజయవంతంగా చేపట్టడంప ఇస్రో బృందానికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. “ చంద్రయాన్ 3 విజయం తర్వాత భారత్ తన రోదసీ యాత్రను కొనసాగిస్తోంది.

భారత్‌కు చెందిన మొదటి
సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 లాంచింగ్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు నా అభినందనలు. మానవాళి సంక్షేమం కోసం రోదసీపై అవగాహన పెంపొందించుకోవడానికి, ఈ శాస్త్రీయ ప్రయోగాలు అవిశ్రాంతంగా కొనసాగుతాయి” అని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇతర ప్రముఖుల అభినందనలు
ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని స్వయంగా వీక్షించిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఇస్రోకు నా అభినందనలు. ఈ లాంచింగ్‌ను ప్రపంచ మంతా ఊపిరిబిగబట్టి వీక్షించింది. ఇది భారత్‌కు సన్‌షైన్ మూవ్‌మెంట్ అని కొనియాడారు. ఇది అసాధారణ ఘనత అంటూ కేంద్ర మంత్రి అమిత్‌షా అభివర్ణించారు. ‘ఇస్రో శాస్తవేత్తలు యువతో స్ఫూర్తిని రగిల్చే విజయాలు సాధిస్తున్నారు. ఆదిత్య ఎల్ 1 లాంచింగ్‌లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు , స్పేస్ ఇంజినీర్లు, పరిశోధకులకు ఎంతో రుణపడి ఉంటాం. ’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News