Friday, September 20, 2024

40 వేల దిగువకు కేసులు

- Advertisement -
- Advertisement -

 24 గంటల్లో 38,044 కేసులు
 490 మరణాలు, డెత్‌రేట్ 1.49 శాతం
 కోలుకున్నవారు 76,03,121 రికవరీ రేట్ 91.96

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కరోనా కేసులు 38,310,మరణాలు 490 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,67,623కు, మొత్తం మరణాల సంఖ్య 1,21,097కు చేరింది. 24 గంటల్లో 58,323మంది రికవర్ కాగా, కోలుకున్నవారి సంఖ్య76,03,121కి చేరింది. దీంతో, రికవరీ రేట్ 91.96 శాతంగా, మరణాల రేట్ 1.49 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 5,41,405గా నమోదైంది. మొత్తం కేసుల్లో ఇది 6.55 శాతం మాత్రమే. యాక్టివ్ కేసులు ఆరు లక్షలకన్నా తక్కువగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇటీవల 24 గంటల్లో 40 వేలకన్నా కేసులు తక్కువగా నమోదు కావడం ఇది రెండోసారి. అక్టోబర్ 27న 36,470 కేసులు నమోద య్యాయి. సోమవారం 10,46,247 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 11,17,89, 350కి చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది.

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య ఆగస్టు 7న 20 లక్షల మార్క్ దాటగా, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షలు, సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, 29న 80 లక్షల మార్క్ దాటింది. 24 గంటల్లో 490మరణాలు నమోదు కాగా,వీటిలో 10రాష్ట్రాల్లోనే 80 శాతం ఉండటం గమనార్హం. అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 104 నమోదయ్యాయి. 10రాష్ట్రాల్లో 74 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రల్లో 4000కు పైగా.. బెంగాల్‌లో 3000కుపైగా కేసులు నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News