- Advertisement -
న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు భారత్ 4.5 కోట్ల స్వదేశీ కొవిడ్ టీకా డోసులను పంపించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గవీ ఒప్పందంలో భాగంగా సరఫరా కానున్న ఈ టీకా డోసుల్లో 1.6 కోట్ల డోసులను ఈ ఏడాది జూన్ నాటికి డెలివరీ చేయనున్నట్టు తెలుస్తోంది. సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న టీకాలనే పంపుతారు. ఈ ఏడాది జనవరిలో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి పాక్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో సీరం తయారు చేస్తున్న టీకాలను పాక్ స్వీకరించనున్నది.
India corona vaccine doses to Pakistan
- Advertisement -