- Advertisement -
ఢిల్లీ: భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రికార్డులో స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 630 మంది చనిపోయారు. గత రెండు రోజుల క్రితం 1.03 లక్ష కేసులు నమోదు కాగా ఇప్పుడు 1.15 లక్షల కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భారత్ దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1.28 కోట్లకు చేరుకోగా 1,66,177 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వ్యాధి నుంచి 1.17 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 8.43 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఒక్క మహారాష్ట్రలో దాదాపుగా 55 వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 297 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 25.1 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -