ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో 14,545 మందికి కరోనా వైరస్ సోకగా 163 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కేసుల సంఖ్య 1.06 కోట్లకు చేరుకోగా 1.53 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.02 కోట్ల మంది కోలుకోగా 1.88 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు 19 కోట్ల మంది కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్యలో అమెరికా(2.51 కోట్లు) మొదటి స్థానంలో ఉండగా ఇండియా (1.06) రెండో స్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో అమెరికా (4.2 లక్షలు) తొలి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్(2.14 లక్షలు), ఇండియా(1.53లక్షలు)గా ఉన్నాయి. కరోనా టెస్టుల విషయంలో అమెరికా (29.3 కోట్లు) తొలి స్థానంలో ఉండగా ఇండియా (19 కోట్లు) రెండో స్థానం, చైనా (16 కోట్లు) మూడో స్థానంలో ఉంది.