ఢిల్లీ: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 13,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 162 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1.05 కోట్లకు చేరుకోగా 1.52 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 1.02 కోట్ల మంది కోలుకోగా 1.94 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటివరకు 18.85 కోట్ల మంది కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్యలో అమెరికా (2.48 కోట్లు) తొలి స్థానంలో ఉండగా భారత్ (1.05 కోట్లు) రెండో స్థానం, వరసగా బ్రెజిల్(85.75 లక్షలు),రష్యా(36.12 లక్షలు), యుకె(34.66 లక్షలు), ఫ్రాన్స్(29.38 లక్షలు), ఇటలీ(24 లక్షలు)లు ఉన్నాయి. కరోనాతో మృతి చెందిన వివరాలు దేశాల వారీగా… అమెరికా (4.11 లక్షలు) తొలి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్(2.11 లక్షలు), భారత్(1.52 లక్షలు), మెక్సికో(1.42 లక్షలు), యుకె(91 వేలు), ఇటలీ(83 వేలు), ఫ్రాన్స్(71 వేలు)గా ఉన్నాయి.
భారత్ లో కొత్తగా 13,823 కరోనా కేసులు….
- Advertisement -
- Advertisement -
- Advertisement -