- Advertisement -
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో రెండో వేవ్ కొనసాగుతోంది. భారత్ లో కొత్తగా 72,330 మందికి కరోనా వైరస్ సోకగా 459 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 1.22 కోట్లకు చేరుకోగా 1.62 లక్షల మంది మృతి చెందారు. బుధవారం ఒక్క రోజే 40 వేల మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వ్యాధి నుంచి 1.14 కోట్ల మంది కోలుకోగా 5.84 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 6.51 కోట్ల కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్యలో అమెరికా(3.11 కోట్లు) తొలి స్థానంలో ఉండగా వరసగా బ్రెజిల్(1.27 కోట్లు), భారత్(1.22 కోట్లు), ఫ్రాన్స్(46.44 లక్షలు), రష్యా(45.45 లక్షలు), యుకె(43.45 లక్షలు), ఇటలీ(35.84 లక్షలు) దేశాలు ఉన్నాయి.
- Advertisement -