టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్
ముంబై: త్వరలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు సర్వం ఒడ్డుతామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. యుఎఇ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో విజేతగా నిలచేందుకు సర్వం ఒడ్డుతామని తెలిపింది. మహిళల క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తున్నా ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలం అవుతుండడంతో తమకు ట్రోఫీ లు చేజారుతున్నాయని వాపోయింది. అయితే ఈసారి మాత్రం ఒత్తిడిన జయించేందుకు సిద్ధం గా ఉన్నామని వివరించింది. భారత ఓటమికి చివరి ఓవర్లలో పేలవమైన ప్రదర్శనే కారణమని పేర్కొంది. ఆఖరి నాలుగైదు ఓవర్లలో తాము ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమవుతున్నామని, దీని ప్రభావం జట్టుపై తీవ్రంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇం గ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లును ఎదుర్కొనే సమయంలో ఇలాంటి పరిస్థితు తమ కు ఎదురవుతుందని తెలిపింది. కానీ ఈసారి ప్రపంచకప్‌లో ఒత్తిడిన తట్టుకునేందుకు సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగుతున్నట్టు హర్మన్ వివరించింది. చివరి ఓవర్లలో మానసికంగా స్థిరంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని తెలిపిందే. ఈ లోపాన్ని సరిదిద్దు కుంటే వరల్డ్‌కప్ ట్రోఫీ సాధించడం తమకు అసాధ్యమేమీ కాదని హర్మన్ స్పష్టం చేసింది.
ఇక సుదీర్ఘ కాలంగా భారత్ వంటి బలమైన జట్టుకు సారథిగా ఉండడం ఎంతో గర్వంగా భావిస్తున్నట్టు తెలిపింది. వివిధ రాష్ట్రాకలు చెందిన క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం కొత్త అనుభూతి ఇస్తుందని చెప్పింది. టీమిండియాలోని ప్రతి క్రికెటర్ కలిసికట్టుగా ఉంటారని, సమష్టిగా రాణించడం వల్లే మహిళల క్రికెట్‌లో తమకు వరుస విజయాలు లభిస్తున్నాయని హర్మన్ తెలిపింది.