Friday, November 22, 2024

4 కోట్లకు చేరుకున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

4 crore corona deaths in two years

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించి రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు నాలుగు కోట్ల కరోనా కేసులు వెలుగు చూశాయి. 4,91, 127 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం 17 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 2,85,914 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 11.7 శాతం వృద్ది నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16 శాతానికి పెరిగింది. ఒక్క కేరళ లోనే 55,475 కేసులు బయటపడ్డాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేసుల పరంగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మంగళవారం ఒక్క రోజే 665 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తి కట్టడితో రికవరీల సంఖ్య మెరుగ్గా ఉంది. మరోరోజు కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. మంగళవారం 2,99,073 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీలు 3.73 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 93.23 శాతానికి చేరగా, క్రియాశీల రేటు 5.55 శాతంగా ఉంది. 22 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక మంగళవారం 59 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 163 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News