- Advertisement -
ఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం పంపిణీ చేసింది. దేశంలో 75% మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రారంభించిన 9 నెలల్లో 100 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. జనవరి 16న జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించామని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఒక్కరోజులో అత్యధికంగా 2.50కోట్ల మందికి టీకాలు ఇచ్చామని వెల్లడించింది. జమ్మూకశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, దాద్ర & నగర్ హావేలి, డామన్ & డియూ, గోవా, లక్షద్వీప్ లలో 100 % మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని వెల్లడించింది.
- Advertisement -