Monday, December 23, 2024

సూపర్-4కు టీమిండియా

- Advertisement -
- Advertisement -

పల్లెకెలె : ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా సూపర్4కు దూసుకెళ్లింది. సోమవారం నేపాల్‌తో జరిగిన గ్రూప్‌ఎ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత నాకౌట్‌కు అర్హత సాధించింది. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన నేపాల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం పలుసార్లు అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.

ఓపెనర్లు కుశాల్ (38), ఆసిఫ్ షేక్ (58)లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. చివర్లో సోంపాల్ కామి (48), దీపేంద్ర సింగ్ (29), గుల్షన్ ఝా (23)లు కూడా బ్యాట్‌ను ఝులిపించారు. భారత బౌలర్లలో సిరాజ్, జడేజా మూడేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ 74 (నాటౌట్), శుభ్‌మన్ గిల్ 67 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News