Monday, December 23, 2024

ఇండియా డి 118/8

- Advertisement -
- Advertisement -

అనంతపూర్: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా సి, ఇండియా డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా డి జట్టు 39 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా మిగితా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇండియా డి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొమ్మిది పరుగులు చేసి విజయ్ కుమార్ వైశ్యాక్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇండియా డి జట్టు సభ్యులు అక్షర పటేల్(54 నాటౌట్), సరాన్ష్ జైన్(13), శ్రీకర్ భరత్(13), యాశ్ దుబే(10), శ్రేయస్ అయ్యర్(09), అథర్వ టైడ్(04), రికీ భూయ్(04), దేవ్‌దూత్ పడిక్కల్(0), హర్షిత్ రానా(0) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అక్షర పటేల్(54), అర్షదీప్ సింగ్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇండియా సి జట్టు బౌలర్లలో అన్షుల్ కంబోజ్, విజయ్ కుమార్ వైశ్యాక్, హిమాన్షు చౌహాన్ తలో రెండు వికెట్లు తీయగా మనవ్ సుథార్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News