- Advertisement -
తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్స్ అదరగొట్టారు. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(161), విరాట్ కోహ్లీ(100 నాటౌట్)లు సెంచరీలతో చెలరేగగా.. కెఎల్ రాహుల్(77), నితీశ్ కుమార్ రెడ్డి(38)లు రాణించారు. కోహ్లీ 16 నెలల తర్వాత టెస్టుల్లో శతకం బాదడం విశేషం.
కోహ్లీ శతకం పూర్తి చేసిన వెంటనే భారత్ 134.3 ఓవర్లలో 487/6 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియాకు 533 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక, తొలి ఇన్నింగ్స్ లో 104 పరుగులకే పరిమితమైన ఆస్ట్రేలియా.. 534 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
- Advertisement -