Monday, December 23, 2024

సెమీస్ పోరుకు భారత్

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాపై 24 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

సెయింట్ విన్సెంట్ : టి20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ చేరుకుంది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సారధి రోహిత్ శర్మ(41 బంతుల్లో 7×4, 8×6లతో 92) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది.

అనంతరం లక్ష ఛేదనకు దిగిన ఆసీస్ ప్రారంభంలో ట్రాపీస్ హెడ్(76), మిచెల్ మార్ష్(37)లు పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో భారత బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయానికి 24 పరుగుల దూరంలో ఆగిపోయింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3×4, 2×6లతో 31), శివమ్ దూబే(22 బంతు ల్లో 2×4, 1×6తో 28)మెరుపులు మెరిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News