Monday, December 23, 2024

భారత్‌కు తొలి విజయం..

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 1-0 తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో 15 గోల్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూసిన భారత పురుషుల జట్టుకు ఈ విజయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ గెలుపుతో భారత్ నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆరంభం నుంచే రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి.

బంగ్లాతో పోల్చితే భారత్ కాస్త దూకుడును ప్రదర్శించింది. ప్రథమార్ధంలో భారత్‌కు పలుసార్లు గోల్ చేసే అవకాశం లభించినా ఫలితం లేకుండా పోయింది. తొలి హాఫ్‌లో ఇరు జట్లు 11తో సమంగా నిలిచాయి. ఇక ద్వితీయార్ధం చివరిలో భారత్ ఏకైక గోల్‌ను నమోదు చేసింది. 83వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న సునీల్ ఛెత్రి భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఇక ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న టీమిండియా 10తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 24న జరిగే మ్యాచ్‌లో మయన్మార్‌తో భారత్ తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News