Monday, December 23, 2024

తొలి టెస్టులో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లా జట్టుపై 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది టీమిండియా. 515 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నాలుగో రోజు 234 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు జాకిర్ హసన్(33), షద్మాన్ ఇస్లామ్‌(35)లు శుభారంభం అందించారు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ హుస్సేన్ శాంటో(82) అర్థ శతకంతో రాణించాడు.

అయితే, సీనియర్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్(25) భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. భారత బౌలర్ల ధాటిటికి బంగ్లా బ్యాట్స్ మెన్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో నాలుగో రోజు తొలి సెషన్ లోనే బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. భారత బౌలర్లలో భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్ల పడగొట్టగా.. జడేజా మూడు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News