Friday, December 20, 2024

సెమీస్‌కు భారత్

- Advertisement -
- Advertisement -

లక్నో : వరల్డ్ కప్ 2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. వరుస విజయాలతో సెమీస్‌లో అడుగు పెట్టింది. లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 129 పరుగులకే తోక ముడిచింది. పేసర్లు మహ్మద్ షమీ, బుమ్రా బాల్‌తో చెలరేగడంతో భారత్ నిర్ధేశించి 230 పరుగుల స్వల్ప లక్షాన్ని అందుకోలేక 34 ఓవర్లలోనే చతికిలా పడింది డిపెండింగ్ ఛాంపియన్. దీంతో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(40) తప్ప మరెవరూ చెప్పుకో తగ్గ స్కోరు సాధించలేక పోయారు.

చుక్కలు చూపించిన షమీ..
230 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలో ఇంగ్లండ్ బాగానే ఆడింది. డేవిడ్ మలాన్(16) శుభారంభం చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మమ అనిపించాడు. తొలి వికెట్‌కు బెయిర్ స్టో (14)తో కలిసి 30 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా వరుస బంతుల్లో మలాన్, జో రూట్ (0)లను అవుట్ చేసి భారత్‌కు బిగ్ బ్రేక్ అందించాడు. ఆ తర్వాత షమీ బెన్ స్టోక్స్ (0), బెయిర్ స్టో (0)లను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను కోటుకోకుండా చేశాడు. దాంతో ఇంగ్లండ్ 9 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. ఇక కెప్టెన్ బట్లర్ (10), మొయిన్ అలీ (15)

కాసేపు వికెట్లు పడకుండా ఆడినా కుల్దీప్ యాదవ్ బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం మరోసారి బౌలింగ్‌కు వచ్చిన షమీ మొయిన్ అలీని పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 81 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. క్రిస్ వోక్స్ (10) భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్ల వెనకాల దొరికిపోయాడు. కాసేపటికే లివింగ్ స్టోన్ సయితం ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4, జస్ప్రిత్ బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

తడబడిన భారత్ బ్యాటర్లు..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బాటింగ్‌కు దిగిన టీమిండియా వోక్స్ షాక్ ఇచ్చాడు. అతను వేసిన రెండో ఓవర్‌లో మూడో బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచిన శుభ్‌మన్ గిల్(9) అదే ఓవర్లో నాలుగో ఓవర్లో ఆఖరి బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక తొమ్మిది బంతులు ఆడిన కోహ్లీ పరగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. జోరుమీదున్న రోహిత్.. భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో ఆచీతూచి అడుతూ స్కోర్ బోర్డును పెంచసాగాడు. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్(4) సయితం షార్ట్ లెంగ్త్ బాల్ ఆడబోయి మార్క్‌వుడ్ క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలాడు.

ఆదుకున్న రాహుల్, రోహిత్
40 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను రోహిత్, రాహుల్‌లు ఆదుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు ధాటికి తట్టుకుంటూ 14 ఓవర్లలో 50 పరగులు దాటించారు. అనవసరపు షాట్లకు పోకుండా నిదానంగా ఆడారు. అదిల్ రషీద్ వేసిన 20వ ఓవర్లో మూడో బంతిని స్వీప్ చేసి బౌండరీకి తరలించిన రోహిత్.. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదే క్రమంలో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో ఈ జోడి రోహిత్‌రాహుల్ నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించి ఇక కుదురుకుంటున్నారనుకుంటున్న తరుణంలో డేవిడ్ విల్లే భారత్‌ను మరోసారి దెబ్బకొట్టాడు. అతడు వేసిన 31వ ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ ఆడబోయిన రాహుల్(39).. మిడాన్ వద్ద జానీ బెయిర్‌స్టోకు చిక్కాడు.

అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కలిసి రోహిత్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇక సెంచరీకి దగ్గరవుతున్న క్రమంలో అదిల్ రషీద్ వేసిన 37వ ఓవర్లో ఐదో బంతికి లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చాడు. రోహిత్‌సూర్యలు ఐదో వికెట్కు 33 పరుగులు జోడించారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(8) కూడా విఫలమయ్యాడు. రషీద్.. జడేజాను ఎల్బీగా వెనక్కిపంపాడు. మహ్మద్ షమీ (1)ని మార్క్ వుడ్ ఔట్ చేశాడు. చివరిదాకా ఉంటాడనుకున్న సూర్య కూడా అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో విల్లే వేసిన 47వ ఓవర్లో రెండో బంతికి వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివరలో బుమ్రా(16), కుల్దీప్ యాదవ్(9 నాటౌట్)లు రాణించడంతో భారత స్కోరును 225 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News