Monday, December 23, 2024

అప్పుడు ఇప్పుడు అతడే మనకు శత్రువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భారత్ ఓడిపోవడానికి మూల కారణం ట్రావిస్ హెడ్. ఆసీస్ జట్టును మెగా టోర్నీలో హెడే గెలిపిస్తూ భారత్ కు మాత్రం తలనొప్పిగా మారాడు. వరల్డ్ కప్‌లో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో ఉన్నప్పుడు హెడ్ 137 పరుగులు చేసి ఆసీస్ కు వరల్డ్ కప్ అందించాడు. రోహిత్ క్యాచ్ అందుకొని మలుపు తిప్పింది కూడా హెడ్ కావడం గమనార్హం. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫిస్ ఫైనల్లో ఆస్ట్రేలియాలో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 76 పరుగలతో ఆటను కొనసాగిస్తున్నప్పుడు స్మిత్‌తో కలిసి ట్రావిస్ హెడ్ భారీ సెంచరీ చేశాడు. ఆసీస్‌ను ఓటమిని నుంచి తప్పించడమే కాకుండా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ప్రతీ సారి హెడ్ భారత్‌కు తలనొప్పిగా మారుతున్నాడు. హెడ్ 93 స్ట్రైక్‌రేటు 163 పరుగులు చేయడంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఓటమిని చవిచూసింది. అప్పుడు, ఇప్పుడు హెడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News