Thursday, April 3, 2025

ఆ షాటే ఓటమికి కారణం: గావస్కర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్ 2023లో ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవిచూసింది. రోహిత్ శర్మ మైదానం నుంచి వెనుదిరగడమే ఓటమికి కారణమని సునీల్ గావస్కర్ తెలిపాడు. ఓకే ఓవర్‌లో ఒక సిక్సర్, ఫోర్ కొట్టి పది పరుగులు వచ్చిన తరువాత కూడా రోహిత్ షాట్ కు వెళ్లడం అనేది పెద్ద తప్పు అని అభిప్రాయపడ్డాడు. సరిగ్గా తాకితే అది సిక్సర్ వెళ్లే అవకాశం ఉంది, కానీ హాఫ్ సెంచరీ చెస్తే మన చప్పట్లతో అభిమానించే వాళ్లం కానీ ఆ సమయంలో అంత దూకుడు అవసరం లేదని, అయిదో బౌలర్ వచ్చినప్పుడు అతడిని టార్గెట్ చేస్తు బాగుండునని సునీల్ సలహా ఇచ్చాడు. రోహిత్ తరువాత వెను వెంటనే శ్రేయస్ అయ్యర్ ఔట్ కావడంతో పరుగులు చేయడం గగనంగా మారింది. విరాట్ కోహ్లీ, రాహుల్ తరువాత సూర్యకుమార్ ఒక్కడే బ్యాట్స్‌మెన్ ఉండడంతో విరాట్, రాహుల్ టెస్టు మాదిరిగా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి జట్టు ఆసీస్ ముందు తక్కువ పరుగులు ఉంచడంతో విజయ సాధించడానికి సులభంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News