Wednesday, January 22, 2025

శ్రీలంక నేవీకి డోర్నియర్ సముద్ర నిఘా విమానాన్ని అప్పగించిన భారత్

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక, భారత్ మధ్య ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యం మరింత విస్తరించేలా భారత్ సోమవారం శ్రీలంక నేవీకి డోర్నియర్ సముద్ర నిఘా విమానాన్ని కానుకగా అప్పగించింది. రెండు దేశాల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసం, సహకారంతో భద్రతా వ్యవస్థ మరింత విస్తరించిందని కొలంబో లోని బారత హైకమిషనర్ గోపాల్ బగ్లే పేర్కొన్నారు. శ్రీలంక లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న కటునాయకే విమానస్థావరంలో జరిగిన ఈ అప్పగింత కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రెమె సింఘె, ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ ఎస్‌ఎన్ ఘోర్మడే, తదితరులు పాల్గొన్నారు. భారత్ 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం జరగడం విశేషం.

India delivers Dornier aircraft to Sri Lanka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News