Sunday, January 19, 2025

కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీనియర్ కెనడియన్ అధికారులతో కూడిన కమిషన్ దర్యాప్తు జరుపుతోంది. కెనడా జాతీయ ఎన్నికలను ప్రభావితం చేయడానికి భారత్ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని కమిషన్ ఎదుట హాజరైన ఒక ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

2021 ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని ఆ అధికారి కమిషన్‌కి తెలిపారు. అయితే కెనడాలో జరిగిన గత రెండు ఎన్నికలలో చైనా జోక్యం ఉన్నట్లు కెనడా నిఘా సంస్థ గుర్తించినట్లు కమిషన్ ఎదుట ఒక అధికారి వాంగ్మూలం ఇచ్చారు. 2019, 2021 ఎన్నికలలో జోక్యానికి భారత్, పాకిస్తాన్ ప్రయత్నించినట్లు కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్(సిఎస్‌ఐఎస్) ఆరోపించిన కొద్ది రోజుల్లోనే భారత్ జోక్యం చేదన్న విషయంలో స్పష్టత వచ్చింది.

ఆ రెండు ఎన్నికలలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ విజయం సాధించింది. చైనా ప్రమేయానికి సంబంధించి వచ్చిన వార్తలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రతిపక్ష ఎంపీలు ఒత్తిడి తీసుకురావడంతో విదేశీ జోక్యం ఆరోపణల నిగ్గు తేల్చడానికి ట్రూడో ఒక విచారణ కమిషన్‌ను నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News