వైద్య నిపుణులు వెల్లడి
న్యూఢిల్లీ : రెండు డోసులు పూర్తిగా పొందిన వారికి బూస్టర్ డోసుపై నిర్ణయం తీసుకోడానికి తగిన డేటా సమకూరలేదని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలో థర్డ్‌వేవ్ దేశంలో వ్యాపించనుందన్న అంచనాల నేపథ్యంలో బూస్టర్ డోసు ఎంతవరకు అవసరమన్న దానిపై చర్చ సాగుతోంది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నియామకమైన వైద్య నిపుణుల కమిటీ సెప్టెంబర్అక్టోబర్ మధ్య కాలంలో ఎప్పుడైనా థర్డ్‌వేవ్ దేశంలో తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉన్నందున టీకా డ్రైవ్‌ను ముమ్మరం చేయాలని సూచించింది. అయితే ప్రపంచ దేశాల్లో టీకా లభ్యత తీవ్రంగా నిరోధించబడి ఉన్నందున బూస్టర్ డోసులు ఇవ్వడాన్ని రెండు నెలల వరకు ఆపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
బూస్టర్ డోసు ఎప్పుడు ఎంతవరకు అవసరమో భారత్ శాస్త్రీయ ఆధారాలపై నిర్ణయిస్తుందని ఎన్‌టిఎజిఐ కొవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కె అరోరా వెల్లడించారు. గతంలో టీకా పొందిన వారికి బూస్టర్ డోసు ఎంతవరకు అవసరమో కచ్చితమైన సాక్షాధారాలు ఏవీ లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న టీకాలు డెల్టా వేరియంట్‌తో సహా కరోనా వైరస్‌లను నిరోధించడంలో సమర్ధంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఇంతవరకు సింగిల్ డోసు కూడా పొందని వారికి, అలాగే రానున్న వేవ్‌లో ఎక్కువ రిస్కులో ఉన్నవారికి టీకా అందిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి బూస్టర్ డోసులు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు డేటా తగినంత ఎక్కువగా లభిస్తే అప్పుడు ఎలాంటి రకం బూస్టర్ డోసు ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించడానికి వీలవుతుందని చెప్పారు.
India Doesn’t Have Enough Data To Decide On Covid