Saturday, January 25, 2025

విదేశీయ విమాన ప్రయాణాల్లో రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణ ప్రయాణాలు చేసే వారి సంఖ్య సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంతగా గత గురువారం నాడు దేవీయంగా 4,63,417 మంది విమానాల్లో ప్రయాణించారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా పంచుకుంది.ఈ ఏడాది నవంబర్‌లో వీరి సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని తెలిపింది.‘ కొవిడ్ తర్వాత దేశీయ విమానయాన రంగం తిరిగి పుంజుకోవడం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సానుకూల వైఖరి, ప్రగతిశీల విధానాలు, ప్రయాణికుల్లో పెరిగిన విశ్వాసం వంటివి దేశీయంగా విమానసర్వీసులు

ఇలా రికార్డు స్థాయికి చేరుకోవడానికి దోహదం చేశాయి’ అని విమానయాన శాఖ ట్వీట్ చేసింది. ఈ విషయంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది నవంబర్‌లో ఇప్పటివరకు 5,998 విమాన సర్వీసుల ద్వారా 4,63, 417 మంది ప్రయాణించారు. ముఖ్యంగా నవంబర్ 18, 19, 20 తేదీల్లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణించారని విమానయాన శాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News