- Advertisement -
ఖాట్మండ్ : నేపాల్‌కు 75 అంబులెన్స్‌లను, 17 స్కూల్‌బస్సులను భారత్ ఆదివారం బహూకరించింది. నేపాల్‌తో పటిష్టమైన, సుదీర్ఘకాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే దిశగా ఆ దేశం లోని ఆరోగ్య భద్రత, విద్యారంగాల్లో మౌలిక సదుపాయాలను విస్తృతం చేయడానికి వీలుగా వీటిని అందజేసింది. నేపాల్‌లో కొత్తగా నియామకమైన భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవ ఆయా వాహనాల కీలను నేపాల్ విద్య, సైన్స్, అండ్ టెక్నాలజీ మంత్రి దేవేంద్ర పాడెల్ సమక్షంలో అందజేశారు. ఈ 75 అంబులెన్సులూ 75 సంవత్సరాల భారత స్వాతంత్ర వేడుకలకు చిహ్నాలని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది నేపాల్ భారత్ అభివృద్ధి భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా మంత్రి పేర్కొన్నారు. నేపాల్‌లో భారత్ అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టిందని, ఉభయ దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత పటిష్టం అయ్యేలా కొనసాగుతాయని పేర్కొన్నారు.
- Advertisement -