Wednesday, January 22, 2025

యుఎన్‌కు భారత్ మిలియన్ డాలర్ల విరాళం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో హిందీ భాష వ్యాప్తి, వినియోగానికి సంబంధించి ఇతోధికంగా ప్రోత్సహించేందకు భారత్ స్వచ్ఛందంగా ఒక మిలియన్ డాలర్లను విరాళంగా అందజేసింది. ఒకరినొకరు హిందీలో సంభాషించడం, అర్ధం చేసుకోవడానికి వీలుగా ప్రపంచ వ్యాప్తంగా హిందీని ప్రాచుర్యం లోకి తీసుకొచ్చేందుకు ఈ విరాళం మరింత ప్రోత్సాహం కలిగిస్తుందని ఐక్యరాజ్యసమితి లోని శాశ్వత భారత రాయబారి రుచిర కాంబోజ్ సోమవారం వెల్లడించారు. ఈమేరకు ఒక మిలియన్ డాలర్ల చెక్కును ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ జనరల్ మెలిస్సా ఫ్లెమింగ్‌కు కాంబోజ్ అందజేశారు.

వార్తా ప్రసారం, బహుళ మీడియా సమాచారం ద్వారా ప్రధాన స్రవంతి లోకి హిందీ భాషను తీసుకురాడానికి ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలను భారత్‌తోపాటు హిందీ మాట్లాడే జనాభా ఉన్న ప్రాంతాలన్నీ ప్రశంసిస్తున్నాయని కాంబోజ్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితిలో హిందీ భాషను వినియోగించడాన్ని భారత్ నిరంతరం ప్రోత్సహిస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితిలో హిందీ ప్రోత్సాహక ప్రాజెక్టు 2018లో ప్రారంభమైంది. ప్రపంచ దేశాల్లో హిందీ మాట్లాడే వారికి ప్రపం చస్థాయి అంశాలు తెలియజేయడానికే ఈ ప్రాజెక్టు లక్షం. హిందీ భాషాభిమానులు ట్విటర్‌లో 50,000, ఇన్‌స్టాగ్రామ్‌లో 29,000,ఫేస్‌బుక్‌లో 15000, మంది ప్రతిఏటా అనుసరిస్తున్నారు. ఇంటర్నెట్‌లో టాప్ 10 భాషల్లో హిందీ యుఎన్ వెబ్‌సైట్ ద్వారా ఏటా 1.3 మిలియన్ మంది నెటిజన్లు ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News