Sunday, November 24, 2024

సంస్కరణలు ఎంతో కీలకం

- Advertisement -
- Advertisement -

2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్

న్యూఢిల్లీ : వచ్చే దశాబ్దాల్లో దేశీయ పనితీరు మూలాలు మెరుగయ్యేందుకు సంస్కరణలు ఎంతో కీలకమని, ఇవి దేశ వృద్ధికి దోహదం చేస్తాయని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అదే సమయంలో 100వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక నాటికి భారత్ 25 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఎదురుచూస్తోంది. అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలతో సహా ప్రతిఒక్కరికి భవిష్యత్ ఫలాలు అందేందుకు దేశీయ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఎంతో కీలకమైందని శుక్రవారం ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ వార్షిక సదస్సులో చంద్రశేఖరన్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారికి ముందు, ఆ తర్వాత ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, ఇది 2047లో భారతదేశానికి పునరుద్ధరణ విజన్‌కు గట్టి పునాది వంటిదని అన్నారు. ‘వచ్చే కొన్ని దశాబ్దాలను చూస్తే, భారత్ కీలక వృద్ధి అవకాశాలను సమర్పించనుంది. అదే సమయంలో గత కొద్ది సంవత్సరాలుగా చేపట్టిన సంస్కరణల పరిధిని గుర్తుంచుకోవడం ముఖ్యం’ అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారికి ముందు ప్రభుత్వం జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను), దివాళా చట్టం(ఐబిసి), ద్రవ్యోల్బణం లక్షంగా వ్యవస్థ, కార్పొరేట్ పన్ను రేటులో తగ్గింపు, బ్యాంకింగ్ రంగం బ్యాలెన్స్ షీట్లను పరిష్కరించడం వంటివి చేపట్టిందని చంద్రశేఖరన్ అన్నారు.

గత బడ్జెట్ల స్ఫూర్తిని అనుసరిస్తా
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

వచ్చే ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రజల ఖర్చుల నేపథ్యంలో వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని, గత బడ్జెట్ల స్ఫూర్తిని అనుసరిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 202324 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చే ఏడాదిలో ఫిబ్రవరి 1న సీతారామన్ వరుసగా ఐదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా చేపట్టే కార్యక్రమాలకు భారీ ఖర్చులు ఉంటాయని సంకేతాలిచ్చారు. 202223 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్‌కు ఊతమందించేందుకు గాను ఆర్థిమంత్రి రూ.7.5 లక్షల కోట్లతో మూలధన వ్యయాన్ని 35.4 శాతం పెంచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News