Tuesday, November 5, 2024

హాకీ క్వార్టర్ ఫైనల్లో భారత్

- Advertisement -
- Advertisement -

ఆస్ట్రేలియాపై సంచలన విజయం

పారిస్: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవా రం జరిగిన పూల్‌బి మ్యాచ్‌లో భారత్ 32 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజ యం సాధించింది. ఈ విజయంతో భారత్ క్వా ర్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. అంతే గాక ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై విజయం సా ధించడం 1972 తర్వాత ఇదే మొదటిసారి కా వడం విశేషం. ఇక పూల్‌బి నుంచి భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బెల్జియం జట్లు కూడా క్వా ర్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ అ సాధారణ ఆటతో ఆస్ట్రేలియాను కంగుతి నిపించింది. ఆరంభం నుంచే భారత్ ఎటాకింగ్ గేమ్‌తో ముందుకు సాగింది.

12వ నిమిషంలో అభిషేక్ భారత్‌కు తొలి గోల్ సాధించి పెట్టా డు. తర్వాతి నిమిషంలోనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు రెండో గోల్ అందించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా దూకుడును కనబరిచింది. 25వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు థామ స్ క్రెగ్ గోల్ సాధించాడు. మరోవైపు 32వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ భారత్ తరఫున మూ డో గోల్ నమోదు చేశాడు. తర్వాత ఆస్ట్రేలియా వరుస దాడులతో భారత్‌ను హడలెత్తించింది. 55వ నిమిషంలో బ్లేక్ ఆస్ట్రేలియాకు రెండో గోల్ అందించాడు. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ 32తో మ్యాచ్‌ను గెలిచి పూల్‌బిలో రెం డో స్థానాన్ని దక్కించుకుంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ మూడింటిలో విజయం సాధిం చింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా, మరో దాంట్లో ఓటమి చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News