బ్రిటన్‌పై 3 -1 గోల్స్ తేడాతో ఘన విజయం
41 ఏళ్ల తర్వాత తొలిసారి ఘనత
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ పురుఫుల జట్టు సెమీ ఫైనల్‌కుదూసుకెళ్లింది. ఆదివారం జరిగినక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై 3-1 గోల్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటినుంచీ భారత జట్టు బ్రిటన్‌కు ఏమాత్రం అవకాశమివ్వకుండా దూకుడుగా ఆడింది. ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశమివ్వకుండా బలమైన రక్షణ వ్యూహాన్నీ అమలు చేసింది. ఫలితంగా భారత్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ తొలి క్వార్టర్ ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్ సింగ్ గోలు చేయగా, రెండో క్వార్టర్‌లో 16వ నిమిషంలో గుర్జత్ సింగ్ మరో గోలు చేశాడు. దీంతో మ్యాచ్ విరామ సమయానికి భారత్ 2- 0 గోల్స్ ఆధిక్యంలో నిలిచింది. కాగా విరామం అనంతరం 45వ నిమిషంలో బ్రిటన్ తొలి గోలు చేసింది.
దీంతో మూడో క్వార్టర్ ముగిసే సమయానికి స్కోరు 2- 1గా నిలిచింది. ఆ తర్వాత భారత్ వీలయినంత వరకు ప్రత్యర్థికి బంతి అందకుండా చూసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇదే క్రమంలో 57వ నిమిషంలో హార్దిక్ సింగ్ మూడో గోలు చేసి భారత్ ఆధిక్యతను మరింత పెంచాడు. కాగా భారత్ ఒలింపిక్స్ హాకీలో సెమీఫైనల్‌కు చేరడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. వాస్తవానికి మొదట్లో భారత్ హాకీలో ప్రపంచంలోనే మేటి జట్టుగా ఉండేది. ఒలింపిక్స్‌లో మొత్తం ఎనిమిది స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్య పతకాలు అందుకున్న భారత జట్టు.. చివరిసారిగా 1980లో స్వర్ణ పతకం సాధించింది. అప్పటినుంచి ఒలింపిక్స్‌లో పూల్ లేదా క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయి వెనుదిరిగేది. తాజాగా క్వార్టర్ ఫైనల్‌లో గెలుపొంది 41 ఏళ్ల తర్వాత తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. ఆగస్టు 3న జరిగే సెమీ ఫైనల్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది.